త్రీ సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ధనుష్, శృతి హాసన్, ప్రభు, భానుప్రియ, రోహిణి, శివా కార్తికేయన్, సుందర్ రాము తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఐశ్వర్య ధనుష్ నిర్వహించారు మరియు నిర్మాతలు కె విమలాగీత, నట్టికుమార్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకుర్చరు.
కథ
రామ్(ధనుష్), జనని(శ్రుతిహాసన్) టీనేజ్ లోనే ప్రేమలో పడి కొంచెం అటూ ఇటూగా ఇష్టం లేని పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకుంటారు. చక్కగా సంసారం సాగుతోందనుకున్న సమయంలో రామ్ ఓ లెటర్ రాసి ఆత్మ హత్య చేసుకుంటాడు. ఆత్మ హత్య చేసుకునేంత కష్టం రామ్ కి ఏమి వచ్చింది... అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.