7:11 PM సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాహస్ పగడాల, దీపికా రెడ్డి, టెస్ వాల్ష్, రఘు కారుమంచి, భరత్ రెడ్డి, రైజింగ్ రాజు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం చైతూ మాదాల వహించారు. నిర్మతలు నరేన్ యనమదల, మాధురీ రవిపాటి, వాణి కన్నెగంటి నిర్మించారు. సంగీతం గ్యాని అందించారు.
కథ
హంసలదీవి అనే ఊరిలో రవి ప్రసాద్ (సాహస్) అనే యువకుడు ఆటో గ్యారేజ్‌లో పని చేస్తూ 1997 సంవత్సరంలో ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో సివిల్ సర్వీస్ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతుంటాడు. అదే గ్రామానికి చెందిన విమల (దీపికా రెడ్డి), రవి పీకల్లోతు ప్రేమలో ఉంటారు. స్థానిక ఎమ్మెల్యే బసవపున్నయ్య, కృష్ణ (భరత్ రెడ్డి) మధ్య రాజకీయాలు రంజుగా సాగుతుంటాయి. స్థానిక ఎమ్మెల్యే అండతో రాజేశ్ అనే వ్యక్తి అపరిమితం అనే ఫైనాన్స్ కంపెనీ నడుపుతూ గ్రామస్థులను మోసగించే సిద్దమవుతాడు. ఆ మోసాన్ని అడ్డుకొనే ప్రయత్నంలో టైమ్ మిషన్ రూపంలో ఉండే బస్సును ఎక్కిన రవి ప్రసాద్ తెల్లవారి నిద్ర లేచే సరికి మెల్‌బోర్న్‌లో ప్రత్యక్షమై 2024 సంవత్సరంలోకి వెళ్తాడు. హంసలదీవికి టైమ్ మిషన్ ఎందుకు వచ్చింది? టైమ్ మిషన్‌ను ఎందుకోసం తెచ్చారు? ఎమ్మెల్యే బసవపున్నయ్య ఎలాంటి మోసాలకు పాల్పడుతుంటాడు? విమల, రవి ప్రసాద్ ప్రేమ వ్వవహరం ఎలా సాగింది? ఊరి పెద్ద కృష్ణ (భరత్ రెడ్డి) ఎలాంటి పనుల చేస్తుంటాడు? అపరిమితం ఫైనాన్స్ కంపెనీ నడిపే రాజేష్ ఎన్ని కోట్ల కుంభకోణం చేయాలని ప్రయత్నించాడు? టైమ్ మిషన్‌లో 25 సంవత్సరాల ముందుకు వెళ్లిన రవి ప్రసాద్‌కు ఎలాంటి భయంకర విషయాలు తెలిసాయి? 2024 నుంచి 1997 రవి ప్రసాద్ వచ్చాడా? 25 సంవత్సరాలు మళ్లీ వెనక్కి వెళ్లి అక్రమాలను అడ్డుకోవడానికి ఏం చేశాడు? విమలను ఓ పెద్ద ఆపద నుంచి ఎలా కాపాడి తన ప్రేమను నిలుపుకొన్నాడు? ఆస్ట్రేలియాలో సారా ఎలాంటి హెల్ప్ చేసింది? అనే ప్రశ్నలకు సమాధానమే 7:11 సినిమా కథ.