twitter

    99 సాంగ్స్ స్టోరి

    99 సాంగ్స్ మ్యూజికల్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఏషన్ భట్, ఎడిల్సి వర్గస్, టెంజిన్ దళ్హ, ఆదిత్య సీల్, లిసా రే, మనీషా కొయిరాలా, థామ్సన్ ఆండ్రూస్, రాహు రామ్, రెమో ఫెర్నాడ్స్, అశ్వత్ భట్, కురుష్ దేబూ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విశ్వేష్  కృష్ణ మూర్తి వహించారు. ఈ సినిమాకి, నిర్మాత, సంగీతం ఏ ఆర్ రెహమాన్ అందించారు. 

    కథ
    మ్యూజిక్ జీవితాన్ని నాశనం చేస్తుందనే తండ్రి హెచ్చరికలు, బెదిరింపులను పక్కన పెట్టి సంగీతమే సర్వస్వంగా జయ్ (ఇహాన్ భట్) బతుకుతుంటాడు. సోఫియా సింఘానియా (ఎడిల్సీ వర్గాస్)తో ప్రేమలో పడుతాడు. సోఫియా తండ్రి సింఘానియా (రంజిత్ బారట్) ఇహాన్ భట్ ప్రేమను వ్యతిరేకిస్తాడు. సంగీతంతో ప్రపంచాన్ని మార్చేయాలనుకొంటున్న జయ్‌కి సవాల్ విసరుతాడు. నా కూతురును పెళ్లి చేసుకోవడానికి ముందు 100 పాటలకు కంపోజ్ చేయమని సవాల్ విసురుతాడు. బిజినెస్‌మ్యాన్ సింఘానియా విసిరిన సవాల్‌ను జయ్ ఎలా స్వీకరించాడు? 100 పాటలను పూర్తి చేయడానికి జయ్ ఈశాన్య రాష్ట్రాలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? షిల్లాంగ్‌లో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. డ్రగ్స్ కేసులో జయ్‌కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? డ్రగ్ ఎడిక్ట్ అయ్యారనే ఆరోపణలతో జయ్‌ను హాస్పిటల్‌లో ఎందుకు చేర్పించారు? 99 పాటలు చేసిన తర్వాత 100 పాటకు స్పూర్తి ఏమిటి? తన తల్లి (వారినా హుస్సేన్) జీవితంలో జరిగిన విషయాలు జయ్‌కి ఎలా తెలిసాయి? 100వ పాట కోసం తల్లి నుంచి ఎలాంటి స్పూర్తిని తీసుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే 99 సాంగ్స్‌ సినిమా కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie 99 సాంగ్స్ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X