A1 ఎక్స్‌ప్రెస్ సినిమా డ్రామా, స్పోర్ట్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, సుదర్శన్, సత్య అక్కల మురళీశర్మ, రఘుబాబు తదితరులు నటించారు. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం ఈ చిత్రాన్ని నిర్మించారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు
కథ
సంజు (సందీప్ కిషన్) అలా జాలీగా కాలాన్ని గడిపే ఓ కుర్రాడు. ఓ పని మీద యానాంకు వెళ్తాడ. అలా హ్యాపీగా సాగుతున్న సందీప్ జీవితంలోకి లావణ్య (లావణ్య త్రిపాఠి) ఎంట్రీ ఇస్తుంది. ఆమె హాకీ క్రీడాకారిణి. ఆమెతో ప్రేమలో పడటం, ఆమె ద్వారా హాకీ కోచ్, రిటైర్డ్ ఆర్మీ అధికారి మురళీ శర్మ పరిచయం అవుతాడు. మరో వైపు రాజకీయ నాయకుడైన రావు రమేష్ కన్ను హాకీ గ్రౌండ్ మీద పడుతుంది. అతడి నుంచి సంజు ఆ హాకి గ్రౌండ్‌ను కాపాడతాడు. సందీప్ హాకీ ఆటకు ఎందుకు దూరంగా ఉన్నాడు? దానికి వెనుకున్న అసలు కథ ఏంటి? చివరకు మళ్లీ హాకీ ఆటను సందీప్ ఆడేందుకు ఒప్పుకుంటాడా? గ్రౌండ్‌ను కబ్జా చేయాలని రాజకీయ నాయకుడు రావు రమేష్ చేసే ప్రయత్నాలను ఎలా అడ్డుకున్నాడు? చివరకు సందీప్ ఇచ్చే మెసెజ్ ఏంటి? చివరకు లావణ్య సందీప్ ప్రేమ కథ ఏమవుతుంది?వంటి పలు ఆసక్తికర అంశాలకు సమాధానమే A1 ఎక్స్‌ప్రెస్.