కథ
ఆశ ( సోనియా ఆకుల) సామాజిక సేవ చేసే యువతి. తల్లిదండ్రులు, చెల్లితో సంతోషంగా కాలం గడుపుంటారు. తన విధి నిర్వహణ కారణంగా రాత్రి సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తుంది. అయితే తాను బైక్ పార్క్ చేసిన చోటు వద్ద లారీని నడిపే నలుగురు చేతిలో ఆశ చిక్కుకుంటుంది. ఆమె నలుగురు దారుణంగా లైంగిక దాడి చంపేస్తారు. ఆశపై లైంగిక దాడి, హత్య తర్వాత ప్రజలు, న్యాయ నిపుణులు, మానవ హక్కుల అధికారులు, పోలీసులు ఎలా స్పందించారు? ఆశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మానవ హక్కుల సంస్థ అధికారి (శ్రీకాంత్ అయ్యాంగర్) స్పందన ఏమిటి? అనే కాల్పనిక ప్రశ్నలకు యదార్థ రూపమే ఆశ చిత్రం.