అబ్బాయితో అమ్మాయి సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ శౌర్య, పలక్ లాల్వణి, బ్రహ్మానందం, రావు రమేష్, మోహన్, ప్రగతి, తులసి, పృథ్వీ తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రమేష్ వర్మ నిర్వహించారు మరియు సంగీతదర్శకుడు ఇళయరాజ స్వరాలు సమకుర్చారు.
కథ
ఇంజనీరింగ్ కుర్రాడైన అభి (నాగశౌర్య) తనకూ ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండాలనే ఉద్దేశ్యంతో కనిపించిన ప్రతీ అమ్మాయినీ ట్రై చేస్తుంటాడు. ఈ క్రమంలో ప్రార్థన (పల్లక్ లల్వాని)తో ప్రేమలో పడతాడు. ఇద్దరూ శారీరకంగా కూడా కలుస్తారు. విషయం ఇంట్లో తెలియడంతో పెద్ద గొడవ జరుగుతుంది. ఆ తర్వాత కథ మలుపు తిరుగుతుంది. ఇద్దరూ విడిపోతారు. తర్వాత అభికి ఫేస్ బుక్ ద్వారా సమంత అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ప్రార్థన....పవన్ కళ్యాణ్ అనే అబ్బాయికి ఫేస్ బుక్ ద్వారా దగ్గరవుతుంది. అభి, ప్రార్థనలకు.... సమంత, పవన్ కళ్యాణ్ లతో సంబంధం ఏమిటి? చివరకు ఏమైంది అనేది తెరపై చూడాల్సిందే.