అభినేత్రి సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు తమన్న భాటియా, ప్రభుదేవా, అమీ జాక్సన్, సోను సూద్, మురళి శర్మ, సప్తగిరి, ప్రిథ్వి, హేమ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విజయ్ ఎ ఎల్ నిర్వహించారు మరియు నిర్మాత ఎమ్ వి వి సత్యనారాయణ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకులు తమన్ ఎస్, జి వి ప్రకాష్ కుమార్, వాజిద్ ఆలీ, సజిద్ అలీ సంయుక్తంగా స్వరాలు సమకుర్చరు.
కథ
ముంబై లో ఉద్యోగం చేసే కృష్ణ (ప్రభుదేవా) అందంలో, యాటిట్యూడ్ లో మోడ్రన్ గా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కొన్ని పరిస్థితులతో కుటుంబపరమైన ఒత్తిడి కారణంగా ఇష్టం లేకపోయినా పల్లెటూరి అమ్మాయి దేవి(తమన్నా)ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లి తర్వాత ఆమెను ముంబై తీసుకొచ్చి ఓ పాత అపార్టుమెంటులో కాపురం పెడతాడు కానీ తాను పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలిస్తే పరువు పోతుందనే భయంతో పెళ్లి విషయం ఎవరికీ తెలియనివ్వడు. దేవిని ఎలాగైన ఒప్పించి ఊరికి పంపించాలనుకుంటున్న కృష్ణ...ఆమె ప్రవర్తనలో మార్పును గమనిస్తాడు. తాము ఉంటున్న ఇంట్లో అంతకు ముందు రూబి(తమన్నా) అనే అమ్మాయి ఉండేదని, సినిమా హీరోయిన్ అవ్వాలనే కోరిక తీరక మరణించిందనే విషయం తెలుస్తుంది. దేవి ప్రవర్తనలో మార్పు కారణం రూబీ ఆత్మ ఆమెలో చేరడమే అని తెలుసుకుని షాకవుతాడు. దేవి శరీరంలోకి ప్రవేశించిన ఆత్మ తన కోరికను నేరవేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. హీరోయిన్ గా ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ఈ క్రమంలో ఆమె స్టార్ హీరో రాజీవ్(సోనూసూద్) కంట్లో పడుతుంది. రాజీవ్ దేవిని ఇష్టపడుతుంటాడు. మరి... ఆత్మ నుండి, రాజీవ్ నుండి కృష్ణ తన భార్యను ఎలా కాపాడుకున్నాడనే అనేది తర్వాతి స్టోరీ.