X
తెలుగు » సినిమాలు » అభినేత్రి
అభినేత్రి

అభినేత్రి

Romance | 07 Oct 2016 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

అభినేత్రి స్టోరీ

అభినేత్రి సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు తమన్న భాటియా, ప్రభుదేవా, అమీ జాక్సన్ , సోను సూద్ , మురళి శర్మ, సప్తగిరి, ప్రిథ్వి, హేమ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విజయ్ ఎ ఎల్ నిర్వహించారు మరియు నిర్మాత ఎమ్ వి వి సత్యనారాయణ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకులు తమన్ ఎస్, జి వి ప్రకాష్ కుమార్, వాజిద్ ఆలీ, సజిద్ అలీ సంయుక్తంగా స్వరాలు సమకుర్చరు.  కథ ముంబై లో ఉద్యోగం చేసే కృష్ణ (ప్రభుదేవా) అందంలో, యాటిట్యూడ్ లో మోడ్రన్ గా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కొన్ని పరిస్థితులతో కుటుంబపరమైన ఒత్తిడి కారణంగా ఇష్టం లేకపోయినా పల్లెటూరి అమ్మాయి దేవి(తమన్నా)ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లి తర్వాత ఆమెను ముంబై తీసుకొచ్చి ఓ పాత అపార్టుమెంటులో కాపురం పెడతాడు కానీ తాను పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలిస్తే పరువు పోతుందనే భయంతో పెళ్లి విషయం ఎవరికీ తెలియనివ్వడు. దేవిని ఎలాగైన ఒప్పించి ఊరికి పంపించాలనుకుంటున్న కృష్ణ...ఆమె ప్రవర్తనలో మార్పును గమనిస్తాడు. తాము ఉంటున్న ఇంట్లో అంతకు ముందు రూబి(తమన్నా) అనే అమ్మాయి ఉండేదని, సినిమా హీరోయిన్ అవ్వాలనే కోరిక తీరక మరణించిందనే విషయం తెలుస్తుంది. దేవి ప్రవర్తనలో మార్పు కారణం రూబీ ఆత్మ ఆమెలో చేరడమే అని తెలుసుకుని షాకవుతాడు. దేవి శరీరంలోకి ప్రవేశించిన ఆత్మ తన కోరికను నేరవేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. హీరోయిన్ గా ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ఈ క్రమంలో ఆమె స్టార్‌ హీరో రాజీవ్‌(సోనూసూద్‌) కంట్లో పడుతుంది. రాజీవ్ దేవిని ఇష్టపడుతుంటాడు. మరి... ఆత్మ నుండి, రాజీవ్ నుండి కృష్ణ తన భార్యను ఎలా కాపాడుకున్నాడనే అనేది తర్వాతి స్టోరీ.
Read More

అభినేత్రి కాస్ట్ & క్రూ

అభినేత్రి సిబ్బంది సమాచారం

దర్శకత్వం విజమ్ ఎ ఎల్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్, జి వి ప్రకాష్ కుమార్, వాజిద్ ఆలీ, సజిద్ అలీ
నిర్మాత యమ్ వి వి సత్యనారాయణ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అభినేత్రి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కృష్ణ పాత్రలో ప్రభుదేవా ఆకట్టుకున్నాడు. నటనతో పాటు కామెడీ టైమింగ్, డాన్సింగ్ తో అలరించాడు. తమన్నా... దేవి, రూబీ రెండు విభిన్నమైన పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది. రెండు పాత్రల్లో వేరియేషన్స్ అద్భుతంగా ప్రదర్శించింది. ప్రభుదేవాతో పోటీ పడి నటించింది. సినీ స్టార్ పాత్రలో సోనూసూద్‌ ఓకే. సప్తగిరి, మురళీశర్మ, హేమ, పృథ్వీ, షకలక శంకర్‌ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేసారు. దర్శకుడు ఎఎల్. విజయ్ సినిమాను బాగా హ్యాండిల్ చేసాడు. కథను నేరేట్ చేసిన విధానం బావుంది. కథకు ఎంత అవసరమో అంతే హారర్ ఎలిమెంటును జోప్పించారే తప్ప కావాలని అనవసరమైన హారర్ సీన్లు, భయపెట్టే సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టలేదు. హారర్ తక్కువైనా కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడంలో సఫలం అయ్యాడు. హారర్ సినిమాల్లో సాధారణంగా దెయ్యం పగ తీర్చుకునే సన్నివేశాలుంటాయి. ఇందులో అలా పెట్టకుండా ఆత్మ హీరోయిన్ కావాలనే ఒక లక్ష్యంతో కనిపిస్తుంది. అయితే కథనం ఆకట్టుకునే విధంగా లేదు. సెకండాఫ్ సాగదీసినట్లు ఉండటం, లాజిక్ లేని కొన్ని సీన్లు మైనస్ అనిపిస్తాయి. కథ, కథనం కొత్తగా లేక పోయినా.... సస్పెన్స్, ట్విస్టులు కనిపించక పోయినా సినిమాలో కామెడీ ఎలిమెంట్స్ జోడించి వినోదాత్మకంగా నడిపించడం వల్ల ప్రేక్షకులు బోర్ పీలవ్వరు.

అభినేత్రి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అభినేత్రి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+