X
అల వైకుంఠపురములో
Action | Romance | 12 Jan 2020 | U/A | 156 Mins
Telugu

అల వైకుంఠపురములో స్టోరీ

అల వైకుంఠపురములో  సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు అర్జున్, పూజా హెగ్దే, టబు, సుషాంత్, నివేథ పెతురాజ్, మురళి శర్మ, నవదీఫ్, రాహుల్ రామకృష్ణ, సునీల్, జయరామ్, కళ్యాణి నటరాజన్, సచిన్ కేల్దేకర్, హర్ష వర్ధన్, రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ల భరణి, బ్రహ్మాజి, సముథిరఖని తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ వహించారు మరియు నిర్మాత అల్లు అరవింద్ మరియు కె రాధకృష్ణన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ ఎస్ అందించారు. 

కథ

వాల్మికీ (మురళీ శర్మ), రామచంద్ర (జయరాం) ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. కాలం కలిసి వచ్చి జయరాం కంపెనీకి ఓనరైతే. వాల్మికీ మాత్రం సగటు ఉద్యోగిగానే మిగిలిపోతాడు. ఆ క్రమంలో జయరాం భార్య (టబు), వాల్మీకి సతీమణి (రోహిణి) ఒకే సమయంలో ఒకే హాస్పిటల్ పండంటి బిడ్డకు జన్మనిస్తారు. కానీ జయరాం బిడ్డ పుట్టగానే చనిపోయాడని తన బిడ్డను నర్సు సహాయంతో జయరాం బిడ్డగా మార్చేస్తాడు. ఆ తర్వాత జయరాం బిడ్డ బతకడంతో తానే బంటు (అల్లు అర్జున్) అని నామకరణం చేసి పెంచుతాడు. తన లాగా మధ్య తరగతి కుటుంబంలో పెరగకుండా తన బిడ్డ (రాజు) ఉన్నందుకు ఆనంద పడిపోతాడు. కానీ ఓ పరిస్థితిలో నర్సు బంటుకి అసలు విషయం చెప్పడంతో కథలో కొత్త మలుపు తిరుగుతుంది. వాల్మీకి బిడ్డను కాదని తెలుసుకొన్న బంటు ఆ తర్వాత ఏం చేశాడు. తన సొంత తల్లిదండ్రులకు బంటు ఎలాంటి పరిస్థితుల్లో చేరువయ్యాడు. ఆ సమయంలో తన తల్లిదండ్రులకు ఎదురైన సమస్యను ఎలా పరిష్కరించాడు. ఇక తన జీవిత ప్రయాణంలో ఎదురైన అమూల్య (పూజా హెగ్డే)తో ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగింది. రాజ్ (సుశాంత్)‌కు ఎదురైన సమస్యను బంటు ఎలా తీర్చాడు. ఇక కథలో అప్పలనాయుడు (సముద్రఖని), ప్రజాపతి (రాజేంద్ర ప్రసాద్), ఇంటి పెద్ద (సచిన్ ఖేల్కర్) పాత్ర ఏమిటి.. అనేక సమస్యల్లో కూరుకుపోయిన ఇంటిని స్వర్గంగా ఎలా మార్చాడు అనే ప్రశ్నలకు సమాధానమే అల వైకుంఠపురంలో..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+