X
అనామిక
Thriller | 01 May 2014 | U/A |
Telugu

అనామిక స్టోరీ

బాలీవుడ్‌లో సక్సెస్‌ అయిన 'కహాని' చిత్రానికి తెలుగు రీమేక్‌ అనామిక ఇది ఒక థ్రిల్లర్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నయనతార, పశుపతి, వైభవ్, హర్షవర్ధన్ రాణె, నరేష్ ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శేఖర్ కమ్ముల నిర్వహించారు మరియు నిర్మాణం: ఎండమోల్ ఇండియా, లాగ్ లైన్ ప్రొడక్షన్స్, సెలక్ట్ మీడియా హోల్డింగ్స్. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు.

కథ

పీపుల్స్ ప్లాజాలో బాంబు పేలుళ్ల తర్వాత పాత హోంమినిస్టర్ రాజీనామా చేయడంతో ఆ బాధ్యతలు ఆది కేశవయ్య(నరేష్) చేపడతాడు. మతకలహాలు మొదలవుతాయనే సాకుతో పేలుళ్ళకి కారణం అయిన మిలింద్ అంజీ మీద విచారణ వద్దని యంటి టెర్రరిస్ట్ సెల్ అధికారి ఖాన్ (పశుపతి) ని ఆదేశిస్తాడ ఆది కేశవయ్య. అదే సమయంలో అమెరికా నుండి ఉద్యోగ రీత్య హైదరాబాద్‌ వచ్చిన అజయ్‌ శాస్త్రి(హర్షవర్ధన్ రాణె) కనిపించకుండా పోతాడు. దాంతో అజయ్‌ శాస్త్రి భార్య అనామిక భర్తను వెతుకుతూ హైదరాబాద్‌ వస్తుంది. తన భర్త కనిపించడం లేదని శంసీర్ గంజ్ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్‌ ఇస్తుంది. అయితే అనామిక కంప్లైంట్‌ ఆ స్టేషన్‌ సీఐ పట్టించుకోడు. అయితే స్టేషన్లో పని చేస్తున్న పోలీస్‌ సారధి(వైభవ్‌) అజయ్‌ శాస్త్రిని వెదకడంలో సహయపడతాడు. అజయ్‌ శాస్త్రీ ఆచూకి తెలిసిన ప్రతీ వారు చనిపోతూ ఉంటారు. అనామికను కూడా చంపాలని చూస్తారు. పీపుల్స్ ప్లాజా పేలుళ్లకి....అనామిక భర్త మిస్సింగుకు కారణం ఏమిటనేది తెరపై చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+