X
Home టాప్ లిస్టింగ్

టాలీవుడ్‌కి క్యూ క‌ట్టిన బాలీవుడ్ స్టార్స్‌..!

Author Administrator | Updated: Friday, July 14, 2023, 11:38 AM [IST]

ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలో తెలుగు సినిమాల హ‌వా కొన‌సాగుతుంది. దీంతో పాటు క‌న్న‌డ‌, త‌మిళ చిత్రాలు కూడా ఇండియ‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్స్ సునామీ క్రియేట్ చేస్తుండ‌టంతో బాలీవుడ్‌, సౌత్ సినిమా అనే హ‌ద్దులు చెరిగిపోతున్నాయి. దీంతో బాలీవుడ్ స్టార్స్ అంద‌రూ తెలుగు సినిమాల్లో న‌టిస్తున్నారు. అది కూడా పేరెన్నికైన స్టార్స్ కావ‌టం కొస‌మెరుపు మ‌రి. ఇంత‌కీ ఆ స్టార్స్ ఎవ‌రో చూద్దాం..


cover image
Project K
1

బాలీవుడ్ సూప‌ర్ స్టార్.. బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ ఇప్పుడు ప్రాజెక్ట్స్ కె చిత్రంలో ప్ర‌భాస్‌తో క‌లిసి న‌టిస్తున్నారు. అలాగని ఏదో చిన్న పాత్ర కాదు.. ప్ర‌భాస్‌తో స‌మానంగా ఉండే రోల్‌లో అమితాబ్ క‌నిపిస్తార‌ని మేక‌ర్స్ చెప్పేశారు. అయితే ప్రాజెక్ట్ కె ఆయ‌న‌కు తొలి తెలుగు సినిమా ఏం కాదు.. అంత‌కు ముందే ఓ చిన్న చిత్రంలో గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇచ్చారు. అలాగే మ‌నంలో త‌ళుక్కున మెరిశారు. ఇవి కాకుండా మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తోన్న సైరా న‌ర‌సింహా రెడ్డిలో కీల‌క పాత్ర‌లో క‌నిపించి అల‌రించిన సంగ‌తి తెలిసిందే. ఏ మాత్రం వీలున్నా, బిగ్ బి తెలుగు సినిమాల్లో న‌టించ‌టానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. 

హరి హర వీరమల్లు
2

ధ‌ర్మేంద్ర త‌న‌యుడైన బాబీ డియోల్ తొలిసారి తెలుగులో న‌టిస్తున్నారు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తోన్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి ఔరంగజేబు పాత్ర‌లో ఆయ‌న క‌నిపించ‌బోతున్నారు. ఇదే ఆయ‌న తొలి ద‌క్షిణాది సినిమా కావ‌టం కూడా విశేషం. 

NBK 108
3

అలాగే హ్యాండ్‌స‌మ్ హంక్ అర్జున్ రాంపాల్ సైతం టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశారు. బాల‌కృష్ణ‌, అనీల్ రావిపూడి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న NBK 108 మూమీలో అర్జున్ రాంపాల్ విల‌న్‌గా అల‌రించ‌బోతున్నారు. 

దేవర
4

సైఫ్ అలీఖాన్ ప్ర‌భాస్, ఓం రౌత్ కాంబోలో రూపొందిన ఆదిపురుష్‌లో రావ‌ణాసురుడుగా న‌టిస్తున్నారు. స‌రే ఇది బాలీవుడ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ క‌దా అని అనుకుంటే, ఇప్పుడు ఎన్టీఆర్ 30లో సైఫ్ విల‌న్‌గా మెప్పించ‌బోతున్నారు. దీనికి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇది వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది. 

సైంధవ్‌
5

బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధికీ తెలుగులో తొలిసారి న‌టిస్తున్నారు. ద‌క్షిణాది ఇది వ‌ర‌కే ఆయ‌న ర‌జినీకాంత్ హీరోగా న‌టించిన పేట చిత్రంలో విల‌న్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే తొలిసారి తెలుగులోకి అడుగు పెట్టారు. విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా, శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సైంధ‌వ్‌లో న‌టిస్తున్నారు. 

6

బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న మ‌రో స్టార్ సంజ‌య్ ద‌త్‌. నిజానికి చంద్ర‌లేఖ చిత్రంలో సంజ‌య్ ద‌త్ త‌ళుక్కున మెరిస‌న సంగ‌తి తెలిసిందే. అలాగే క‌న్న‌డ చిత్రమైన కె.జి.య‌ఫ్‌లోనూ న‌టించారు. ఇప్పుడు తెలుగులో ప్ర‌భాస్‌, మారుతి సినిమాలో ఇంపార్టెంట్ రోల్‌లో అల‌రించ‌బోతున్నారు. దీంతో పాటు ద‌ళ‌ప‌తి విజ‌య్, లోకేష్ క‌న‌క‌రాజ్ కాంబోలో రానున్న లియో చిత్రంలోనూ ఆయ‌న న‌టిస్తున్నారు. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+