అంతకు ముందు ఆ తరువాత సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుమంత్ అశ్విన్ , ఈషా, రవిబాబు, రావు రమేష్, అవసరాల శ్రీనివాస్, రోహిణి, మధుబాల, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి నిర్వహించారు మరియు నిర్మాత కె ఎల్ దామోదర్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కల్యాణి కోడూరు స్వరాలు సమకుర్చారు.
కథ
రాజమండ్రికి చెందిన కుర్రాడు అనీల్(సుమంత్ అశ్విన్) ...హైదరాబాద్ ఓపెళ్లికి వచ్చి అక్కడ అనన్య(ఈషా)తో ప్రేమలో పడతాడు. అప్పటికే అనన్య తల్లితండ్రులు(మధుబాల,రవిబాబు)...విభేధాలతో విడాకులకు సిద్దంగా ఉండి..రోజూ తగువులాడుకుంటారు. మరో ప్రక్క అనీల్ కు తన తల్లి ఎప్పుడూ చూసినా షాపింగ్ చేస్తూ గడిపేయటం నచ్చదు. ఈ నేపధ్యంలో తమ ప్రేమ..పెళ్లిగా మారితే ఎలా ఉంటుందో అని ఇద్దరూ సహజంగానే భయపడతారు. దాంతో ఇద్దరూ సహజీవనం చేసి...తాము...ఒకరికొకరు సరి అయిన జంటో కాదో...తేల్చుకోవాలనుకుంటారు. అప్పటి నుంచి ఏం జరిగింది..ఇద్దరూ లివింగ్ రిలేషన్ షిప్..మునగకుండా పెళ్లి దాకా వెళ్లిందా లేదా అన్నది మిగతా కథ.