X
Home టాప్ లిస్టింగ్

సౌత్ టాప్ డైరెక్టర్స్ నుంచి రాబోయే సినిమాల లిస్ట్

Author Administrator | Updated: Wednesday, March 29, 2023, 10:11 AM [IST]

సౌత్ సినిమా పరిశ్రమ నుంచి పాన్ ఇండియా స్థాయి లో డైరెక్టర్లు తమ సత్తా చాటడం జరుగుతుంది. ఇంతకు ముందు దక్షిణాది నుంచి జాతీయ స్థాయిలో సినిమాలు చేసే దర్శకుల పేర్లు ఒకటి రెండు మాత్రమే వినిపించేవి. రోబో సినిమాతో శంకర్, గజిని సినిమా తో మురుగదాస్.. వీరి గురించే దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. కానీ ఆ తర్వాత బాహుబలి సినిమా ద్వారా రాజమౌళి ముందుకు దూసుకు వచ్చారు. ఆ సినిమా యొక్క రెండు భాగాలు కూడా సంచలన విజయాలు అందుకోవడంతో దేశంలోనే నెంబర్ వన్ దర్శకుడిగా ఆయన ఇప్పుడు వెలిగిపోతున్నారు. సౌత్ సినిమాలకు సినీ జనం బ్రహ్మరథం పడుతున్న క్రమంలో అనూహ్యంగా ఈ సినిమాలను హీరోలు మాత్రమే కాకుండా దర్శకులు కూడా చేస్తూ ఉండడం విశేషం. తగిన బడ్జెట్ ను కేటాయిస్తే బాలీవుడ్ మాత్రమే కాదు హాలీవుడ్ ను ఢీకొట్టే సినిమాలను కూడా తీయగల సత్తా తమకుందని వీరు నిరూపిస్తున్నారు. సౌత్ టాప్ డైరెక్టర్ల నుంచి రాబోయే సినిమాల లిస్ట్


cover image
ఎస్ ఎస్ రాజమౌళి
1

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన రాజమౌళి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఈ దర్శకుని ఖాతాలో ఒక్క ఫ్లాప్ కూడా లేదు.రాజమౌళి డైరెక్షన్ లో నటించాలని బాలీవుడ్ స్టార్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇతర డైరెక్టర్లు సైతం రాజమౌళి పనితనానికి సాహో అనేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమా అంటే ఇలా చేయాలి అనేలా ఆయన తమ సినిమాలను రూపొందిస్తున్నారు. ఇటీవల వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా భారీ స్థాయి లో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం మహేష్ హీరోగా ssmb 29 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు వున్నాయి 

మణిరత్నం
2

దేశం గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం తనకంటూ ఓ స్థానం సంపాదించారు. మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్‌ సెల్వన్‌-2 ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా మొదటి భాగం తమిళంలో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే మిగతా భాషల్లో మాత్రం ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. కానీ అన్ని భాషలలో కూడా పొన్నియన్‌ సెల్వన్ 2  రిలీజ్ కి సిద్ధమవుతోంది.

శంకర్ ( తమిళ దర్శకుడు)
3

శంకర్ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. శంకర్ మాత్రం బాలీవుడ్ స్టార్ హీరోలతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. శంకర్ సినిమాలకు బాలీవుడ్ లో కూడా క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో రామ్ చరణ్ హీరోగా  గేమ్‌ ఛేంజర్‌ భారీ బడ్జెట్ సినిమాగా వస్తోంది. కమల్ హస్సన్ హీరోగా భారతీయుడు 2 కూడా శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 

ప్రశాంత్ నీల్
4

శాండిల్ వుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు సౌత్ లో  భారీగా క్రేజ్ ఉంది. కేజీఎఫ్ సినిమా భారీ హిట్ కావటం తో  ఒక్కసారిగా గురింపు వచ్చింది. కేజీఎఫ్2 వేరే లెవెల్ లో దూసుకెళ్లింది. ప్రశాంత్ నీల్ అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ప్రస్తుతం ప్రశాంత్‌నీల్‌ ప్రభాస్‌తో కలిసి తెరకెక్కిస్తోన్న చిత్రం 'సలార్‌'. పాన్‌ ఇండియా మూవీగా ఇది రిలీజ్ కానుంది. 

సుకుమార్
5

సుకుమార్ ఈ మార్కెట్ లోకి రాకెట్ స్పీడ్ తో దూసుకువచ్చాడు. అతి తక్కువ సమయంలోనే పుష్ప తో అంతటి స్థాయిలో విజయాన్ని అందుకోవడం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పుష్ప సీక్వెల్ తో మరోసారి అతడు సక్సెస్ సాధించి పాన్ ఇండియా మార్కెట్లో మరో మెట్టు ఎక్కడం ఖాయం అన్న చర్చ సాగుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరక్టర్ సుకుమార్ కాంబినషన్ లో రాబోతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'పుష్ప 2'. బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ 'పుష్ప: ది రైజ్' చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. 

లోకేష్ కానగరాజ్
6

లోకేశ్ కనగరాజ్ నుంచి రాబోయే తదుపరి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు విజయ్ తో తీస్తున్న ‘లియో’ మూవీ కూడా లోకేష్ యూనివర్స్ లో భాగమే అని ప్రచారం రావడంతో ఈ సినిమా పై మరింత ఉత్కంఠ పెరిగింది. దీంతో ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ థియేట్రికల్, డిజిటల్, ఆడియో, శాటిలైట్ హక్కులతో సహా 400 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.

పూరి జగన్నాధ్
7

ఒకప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోందంటే చాలు కుర్రకారు ఎప్పుడెప్పుడు ఆ చిత్రాన్ని చూసేద్దామా అన్నంత ఊపులో ఉండేవారు. యువతను ఆకట్టుకొనే అంశాలను తన కథల్లో చక్కగా చొప్పించి, వారిని పదే పదే తన సినిమా చూసేలా చేసుకోవడంలో మేటి అనిపించుకున్నారు పూరి జగన్నాథ్. తొలి సినిమా ‘బద్రి’ మొదలు, ఈ నాటి ‘లైగర్’ దాకా పూరి ప్రయత్నం అదే తీరున సాగుతోంది. శరవేగంతో సినిమాలను పూర్తి చేయగల నేర్పు పూరి సొంతం! ‘లైగర్’ పరాజయం ఆయన అభిమానులకు నిరాశ కలిగించి ఉండవచ్చు. కానీ, రాబోయే సినిమాతో మా జగన్ ఓ హిట్టు పట్టేస్తాడు చూస్తూండండి అంటూ ఫ్యాన్స్ భరోసాగా ఉన్నారు. వారిలో అంత కాన్ఫిడెన్స్ నింపిన పూరి ప్రస్తుతం ‘లైగర్’ హీరో విజయ్ దేవరకొండతోనే ‘జనగణమన’ తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు.

కోరటాల శివ
8

ఇప్పటివరకు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన 5 సినిమాల్లో నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టాయి.  అయినప్పటికీ ఆ నాలుగు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్లుగా మారాయి.  ఆచార్య మూవీ ప్లాప్ అయ్యింది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా NTR30 భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారు.  యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించే ఈ పాన్ ఇండియా చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుంది. 2024 సమ్మర్ లో రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+