అంతం సినిమా రోమ్యాంటిక్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు రేష్మి గౌతమ్, చరణ్ దీప్, వాసు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జి ఎస్ ఎస్ పి కళ్యాన్ తన స్వియ దర్శకత్వంలో నిర్మించారు మరియు సంగీతదర్శకుడు కార్తిక్ రోడ్రిగ్జ్ స్వరాలు సమకుర్చరు.
కథ
వనిత (రష్మిగౌతమ్), కళ్యాణ్ కృష్ణ(చరణ్‌దీప్) భార్యా భర్తలు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ సాపీగా జీవితం గడిపేస్తుంటారు. ఓ రోజు కళ్యాణ్ కృష్ణ ఉద్యోగ నిర్వహణలో భాగంగా విజయవాడ వెళతాడు. అతడు విజయవాడ నుండి హైదరాబాద్‌కి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి నుండి కాల్ వస్తుంది...నీ భార్యని కిడ్నాప్ చేస్తున్నామని, నీ భార్య నీకు దక్కాలంటే మేం చెప్పినట్టు చేయాలని వార్నింగ్ ఇస్తారు. భార్య కోసం వాళ్లు చెప్పిన పని చేయడానికి సిద్దమవుతాడు కళ్యాణ్ కృష్ణ. వారు చెప్పిన ప్రకారం ఓ చోటుకు వెళ్లి బ్యాగ్ తెస్తాడు. ఇంతకీ ఆ బ్యాగులో ఏముంది? ఈ కిడ్నాప్ వెనక అసలు కారణం ఏమిటి? చివరకు ఏమైంది? అనేది మిగతా కథా.