అనుక్షణం సినిమా సైకో థ్రిల్లర్ క్రైమ్ చిత్రం ఇందులో మంచు విష్ణు, తెజస్వి మదివాడ, మధు శాలిని, రెవతి మినన్, బ్రహ్మనందం, నవదీప్, కోటశ్రీనివాసులు తదితరులు ప్రధానమైన పాత్రాలలో నటించారు. ఈసినిమాకి దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ నిర్వహించారు, నిర్మాత మంచు విష్ణు నిర్మించారు.
కథ
ఓ సైకో అమ్మాయిలను వరుసగా హత్యలు చేస్తూ హైదరాబాద్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంటాడు. ఈ సైకో ఆట కట్టించడానికి ప్రభుత్వం గౌతం(మంచు విష్ణు) అనే స్పెషల్ ఆఫీసర్‌ను నియమిస్తుంది. సైకోను పట్టుకోవడానికి గౌతం పలు ప్రయత్నాలు చేసి విఫలం అవుతాడు. అదే సమయంలో సైకో కిల్లర్స్ మీద రీసర్చ్ చేసిన శైలజ(రేవతి) ఈ కేసులో గౌతంకు సహాయం చేయడానికి వస్తుంది.
వీరి ఇన్వెస్టిగేషన్లో ఆ సైకో టాక్సీ డ్రైవర్ అయిన సీతారాం(సూర్య) అని గుర్తిస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది. అతన్ని పట్టుకోవడంలో గౌతం ఎలాంటి ప్లాన్స్ అమలు చేసాడు? అతను ఎందుకు అలా చేస్తున్నాడు? అనేది తర్వాతి కథ.