X
తెలుగు » సినిమాలు » అనుక్షణం
అనుక్షణం

అనుక్షణం

Crime | 13 Sep 2014 | A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

అనుక్షణం స్టోరీ

అనుక్షణం సినిమా సైకో థ్రిల్లర్ క్రైమ్ చిత్రం ఇందులో మంచు విష్ణు, తెజస్వి మదివాడ, మధు శాలిని, రెవతి మినన్ , బ్రహ్మనందం, నవదీప్, కోటశ్రీనివాసులు తదితరులు ప్రధానమైన పాత్రాలలో నటించారు. ఈసినిమాకి దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ నిర్వహించారు, నిర్మాత మంచు విష్ణు నిర్మించారు. కథ  ఓ సైకో అమ్మాయిలను వరుసగా హత్యలు చేస్తూ హైదరాబాద్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంటాడు. ఈ సైకో ఆట కట్టించడానికి ప్రభుత్వం గౌతం(మంచు విష్ణు) అనే స్పెషల్ ఆఫీసర్‌ను నియమిస్తుంది. సైకోను పట్టుకోవడానికి గౌతం పలు ప్రయత్నాలు చేసి విఫలం అవుతాడు. అదే సమయంలో సైకో కిల్లర్స్ మీద రీసర్చ్ చేసిన శైలజ(రేవతి) ఈ కేసులో గౌతంకు సహాయం చేయడానికి వస్తుంది.  వీరి ఇన్వెస్టిగేషన్లో ఆ సైకో టాక్సీ డ్రైవర్ అయిన సీతారాం(సూర్య) అని గుర్తిస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది. అతన్ని పట్టుకోవడంలో గౌతం ఎలాంటి ప్లాన్స్ అమలు చేసాడు? అతను ఎందుకు అలా చేస్తున్నాడు? అనేది తర్వాతి కథ.
Read More

అనుక్షణం కాస్ట్ & క్రూ

అనుక్షణం సిబ్బంది సమాచారం

దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం NA
నిర్మాత మంచు విష్ణు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అనుక్షణం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఇలాంటి సినిమాల్లో కీలమైన సినిమాటోగ్రఫీని బాగా హ్యాండిల్ చేసారు. అయితే మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోరు, ఎడిటింగ్ ఫర్వా లేదు. ఇలాంటి కథ, కథనాలు మనకు కొత్తేమీ కాక పోయినా...సినిమా చూస్తున్న ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపడంలో రామ్ గోపాల్ వర్మ కొంతమేర మెప్పించాడు. అయితే సినిమాలో ఆశించినంత సస్పెన్స్ మాత్రం లేదు. సీరియస్‌గా నడిచే సినిమాలో బ్రహ్మానందంతో బలవంతంగా కామెడీని జొప్పించే ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. డైలాగ్స్ ఓకే అనే విధంగా ఉన్నాయి. ఈ చిత్రానికి మంచు విష్ణే నిర్మాత. నిర్మాణ విలువల బాగున్నాయి. సినిమాను ఎక్కువ సాగదీయకుండా నిడివి తగ్గించి మంచి పని చేసారు. సైకో థ్రిల్లర్ కథాంశాలు, సస్పెన్స్ జేనర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. కామెడీ, యాక్షన్, రొమాన్స్ లాంటివి ఈ సినిమా నుండి ఆశిస్తే నిరాశ తప్పదు. మొత్తానికి ఇటీవల కాలంలో వచ్చిన పలు రామ్ గోపాల్ వర్మ సినిమాలతో పోలిస్తే కొంతలో కొంత ఈ సినిమా బెటరే అని చెప్పొచ్చు.

అనుక్షణం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అనుక్షణం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+