twitter

    అర్థ శతాబ్దం స్టోరి

    అర్థ శతాబ్దం సినిమా రొమాంటిక్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియా,  నవీన్ చంద్ర, సాయి కుమార్, అమని, పవిత్ర లోకేష్, రాజా రవీంద్ర, సుహాస్ తదితలు నటించారు.  ఈ సినిమాకి దర్శకత్వం రవీంద్ర పుల్లే వహించారు. నిర్మాత చితి కిరణ్ రామోజు నిర్మించారు. సంగీతం న్యుఫాల్ రాజా ఐస్ అందించారు. 

    కథ 
    సిరిసిల్లా గ్రామంలో మాజీ నక్సలైట్ రామన్న (సాయికుమార్) కూతురు పుష్ప (కృష్ణ ప్రియ)ను బాల్యం నుంచే కృష్ణ (కార్తీక్ రత్నం) ప్రేమిస్తూ ఉంటాడు. కానీ తన ప్రేమను ఆమెతో పంచుకోలేకోపోతాడు. పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా పుష్ప అంటే ప్రాణం కంటే మిన్నగా చూసుకొంటుంటాడు. పుష్పపై ఉన్న ప్రేమ కారణంగా కృష్ణ చేసిన ఓ పనికి ఊరంతా గొడవలు, కొట్లాటలతో అట్టుకుడుకుతుంది. ఈ క్రమంలో ఎస్ఐ రంజిత్ (నవీన్ చంద్ర)తోపాటు పోలీసులు రంగ ప్రవేశం చేస్తారు. ఊర్లో చెలరేగిన మంటలను ఎంజాయ్ చేస్తూ రాజకీయ వేత్త (శుభలేఖ సుధాకర్) చలి కాచుకొనే ప్రయత్నం చేస్తాడు. కృష్ణ కారణంగా ప్రారంభమైన ఊరి గొడవలకు ఎలాంటి పరిస్థితులకు దారి తీశాయి? కృష్ణ చేసిన పని ఏమిటి? కూతురు కోసం రామన్న ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? వీరన్న (రాజ రవీంద్ర) గొడవలకు ఎందుకు ఆజ్యం పోసాడు? రాజకీయ నాయకుడు ఈ గొడవను స్వప్రయోజనాలకు వాడుకోవాలని చూశాడు? రాజకీయవేత్త తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ ఎస్పీ (అజయ్) ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకొన్నాడు? కృష్ణ, పుష్ప ప్రేమ ఈ గొడవలను ఆపిందా? అనే ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానమే అర్ధశతాబ్దం.
    **Note:Hey! Would you like to share the story of the movie అర్థ శతాబ్దం with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X