అర్జున్ రెడ్డి సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ దేవర కొండ, షాలిని హీరో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సందీప్ వహించారు మరియు భ్రదకాళి పిక్ఛర్స్ బ్యానర్ పై ప్రణయ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రధన్ స్వరాలు అందించారు.
కథ
డాక్టర్ అర్జున్ రెడ్డి(విజయ్ దేవరకొండ) మంగుళూరులోని సెయింట్ మేరీ కాలేజీ ఫైనలియర్ మెడికల్ స్టూడెంట్. టాప్ ఆఫ్ ది క్లాస్, టాపర్ ఆఫ్ ది యూనివర్శిటీ. అయితే యాంగర్ మేనేజ్మెంటులో జీరో. కోపం వస్తే ఆదుపుచేసుకోలేడు. ఓ చిన్న గొడవలో క్షమాపణ చెప్పడం ఇష్టం లేని అర్జున్ రెడ్డి కాలేజీ వదిలి వెళ్లివెళ్లేందుకు సైతం సిద్ధమవుతాడు. అదే సమయంలో ఫస్టియర్లో కొత్తగా జాయినైన ప్రీతి(శాలిని)ని చూసి మనసు పారేసుకుంటారు. కాలేజీ వదిలి వెళ్లాలనే తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. ఇద్దరి మధ్య లవ్ లివ్ ఇన్ రిలేషన్ షిప్ స్థాయికి వెళ్లిపోతుంది. అర్జున్ రెడ్డి, ప్రీతి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే కులాలు వేరు కావడం వల్ల ప్రీతి తండ్రి నుండి నిరాకరణ ఎదురవుతుంది. ఈ క్రమంలో ప్రీతి తండ్రితో గొడవ పడ్డ అర్జున్ రెడ్డి తాను కావాలో, తండ్రి కావాలో తేల్చుకోవాలని.... 6 గంటల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని గొడవపడి వచ్చేస్తాడు. తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మత్తుమందు తీసుకుంటాడు. అయితే అప్పటికే ఫుల్లుగా మందు కొట్టడంతో రెండు రోజుల పాటు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాడు. అపస్మారక స్థితి నుండి బయటపడి అర్జున్ రెడ్డి కళ్లు తెరిచే లోపు ప్రీతికి ఇంట్లోవాళ్లు బలవంతంగా పెళ్లి చేస్తారు. అంతా అయిపోయాక అర్జున్ వెళ్లి గొడవపడినా ఫలితం లేకుండా పోతోంది. పైగా ప్రీతి బంధువుల నుండి తన్నులు తిని వస్తాడు. తన పరువు తీశావనే కోపంతో అర్జున్ రెడ్డిని తండ్రి ఇంటి నుండి గెంటేస్తాడు. ప్రీతి జ్ఞాపకాల నుండి బయట పడలేక తాగుడుకు, డ్రగ్స్‌కు బానిసైపోతాడు, చివరకు పిచ్చోడిలా రోడ్డున పడేస్థాయి వస్తాడు.... ఆ తర్వాత కథ థియేటర్లో చూస్తేనే బావుంటుంది.