X
అర్య 2
Comedy | Romance | 27 Nov 2009 | U/A |
Telugu

అర్య 2 స్టోరీ

అర్య 2 సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు అర్జున్, నవదీప్, అజయ్, కాజల్, శ్రధ్దా ఆర్య, బ్రహ్మానందం, 
శ్రీనివాస రెడ్డి, ముఖేష్ రుషి, శాయీజీ షిండే తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,మాటలు, స్క్రీన్ ప్లే,దర్శకత్వం: సుకుమార్ నిర్వహించారు మరియు నిర్మాత అదిత్య బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చారు.

కథ

ఇక ఈ సీక్వెల్ లో కూడా ఆర్య(అల్లు అర్జున్) అనాధే. అతనికి అనాధాశ్రయంలో అజయ్(నవదీప్) పరిచయం అవుతాడు. అతన్ని తన స్నేహితుడుగా ఎంచుకున్న ఆర్య బలవంతంగా స్నేహితుడ్ని చేసుకుంటాడు. అంతేగాక ఎప్పుడూ అతన్నే కలవరిస్తూ అతని తోడే జీవితమన్నట్లు బ్రతుకుతూంటాడు(దీనికి రీజన్ వెతక్కండి..అది అంతే). అయితే అజయ్ కు మాత్రం ఆర్య అంటే స్నేహభావం ఉండదు. ఇలా డిఫెరెంట్ గా (గెటప్ కూడా డిఫెరెంట్ గానే ఉంటుంది) పెరిగి పెద్దయిన వీరి జీవితాల్లోకి గీత(కాజల్)ప్రవేశిస్తుంది. అప్పుడు మీరూహించినట్లే ఇద్దరూ ఆమెతో ప్రేమలో పడతారు. క్యాజువల్ గానే ఆర్య తన ట్రిక్ లతో ఆమెను ఆకట్టుకో చూస్తాడు. పనిలో పనిగా ఆమెతో చనువుగా మెలిగే వారిని ఏక్సిడెంట్ దారి తప్పిస్తూంటాడు. అయితే ఆర్య నుంచి తప్పించుకునే ప్రాసెస్ లో గీత తాను అజయ్ ని ప్రేమిస్తున్నానని చెప్తుంది(ఇదేం ట్విస్టు అనకండి..లేకపోతే కథ కదలదు). ఈ లోగా ఈ మలుపు చాలదన్నట్లు గీత తండ్రి రాయలసీమ ఫ్యాక్షనిస్టు(ముఖేష్ రుషి)తన కూతురుని రైవల్ గ్రూప్ ఫ్యాక్షనిస్టు (సాయీజీ షిండే) కొడుకు సుబ్బారెడ్డి(అజయ్)తో మ్యారేజ్ ఫిక్స్ చేస్తాడు.గీతను తన గ్రామం తీసుకెళ్థాడు. అటువంటి పరిస్ధితుల్లో గీత పెళ్ళి చెడకొట్టమని...ఆర్య ని అజయ్ అడుగుతాడు..అటువంటి పరిస్దితుల్లో ఆర్య ఏం చేసాడు. గీత ఎవరిని పెళ్ళి చేసుకుందనేది మిగతా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+