బాద్ షా సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఎన్టీఆర్, కాజల్, నవదీప్, సిద్దార్ద్, బ్రహ్మానందం, నాజర్, ఎమ్ ఎస్ నారాయణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీనువైట్ల నిర్వహించారు మరియు నిర్మాత బండ్లగణేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు థమన్ స్వరాలు సమకుర్చారు.
కథ
ఇటలీలో ఉంటున్న జానకి(కాజల్) ని అనుకోని పరిస్ధితుల్లో కలిసిన(ఆ తర్వాత అనుకునే కలిసాడని రివిల్ అవుతుందనుకోండి) రామారావు(ఎన్టీఆర్)ఆమెని తొలి చూపులోనే ఇష్టపడతాడు. ఆమె ఎప్పుడూ చెప్పే బంతి థీరిని తెగ మెచ్చుసుకుంటూ ఆమెని బుట్టలో పడేసే ప్రయత్నం చేస్తాడు. మరో ప్రక్క అతన్ని ఇంటర్నేషనల్ మాఫియా వెంటాడుతూ చంపేసే ప్రయత్నం చేస్తుంది. వారితో చేసిన ఫైట్ ని తనకోసమే చేసాడుకున్న జానికి అతనితో ప్రేమలో పడిపోయి... పాటలు పాడేసుకుంటుంది. ఇంతకీ ఇతరదేశాలు వచ్చి మరీ రామారావు ఈమెనే ఎంపిక చేసుకుని ప్రేమలో దింపటానికి కారణం ఏమిటి... అతన్ని అంత పెద్ద మాఫియా వెంటేడేటంత గతం ఏమిటి... ఇంతకీ బాధ్షాకీ, ఎన్టీఆర్ కు ఉన్న రిలేషన్ ఏమిటి అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.