X
బాహుబలి
Action | Romance | 10 Jul 2015 | U/A |
Telugu

బాహుబలి స్టోరీ

బాహుబలి సినిమా ను ఒక  పౌరానిక యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, సుదీప్‌, సత్యరాజ్‌, రమ్యకృష్ణ, అడివి శేష్‌, నాజర్‌, తనికెళ్ల భరణి, సుబ్బరాజు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎస్ ఎస్ రాజమౌళి నిర్వహించారు మరియు నిర్మాతలు: ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు.

కథ

 'వంద మందిని చంపితే వీరుడు అవుతాడు...ఒక్కరిని కాపాడితే దేవుడు అవుతాడు' అలాంటి దేముడి కథే ‘బాహుబలి' . శివుడు (ప్రభాస్) మహిష్మతి రాజ్యానికి వారసుడు. అయితే పసిగుడ్డుగా ఉన్నప్పుడే అక్కడ రాజ కుటుంబంలోని అంతర్గత కుట్రకు బలి అవ్వబోయి సాహసవంతురాలైన శివగామి(రమ్యకృష్ణ) చేత రక్షించబడి, ఓ గిరిజన తెగలో పెరుగి పెద్దవుతాడు. వయిస్సుకి వచ్చిన శివుడు అవంతక(తమన్నా) కి ఆకర్షితుడు అవుతాడు. ఇంతకీ అవంతక ఏం చేస్తుంది అంటే... తమ రాజ్యంపు రాజు భల్లాల దేముడు (రానా) కి వ్యతిరేకంగా...మరి కొంత మంది తో కలిసి గొరిల్లా పద్దతిలో పోరాటం చేస్తూంటుంది.

ఆమె లక్ష్యం భల్లాల దేముడు చేతిలో బంధీగా అయిన దేవసేన(అనుష్క)ని రక్షించటం. ఆమెను ప్రేమించిన శివుడు ... ఆ లక్ష్యాన్ని తను నెరవేర్చతానని భుజాన వేసుకుంటాడు. అందులో భాగంగా దేవసేన ను కట్టిపారేసి, హింసిస్తున్న రాజ్యం బయిలుదేరతాడు. అక్కడ వెళ్లాక..అక్కడ జనం అతన్ని ‘బాహుబలి' అని గుర్తుపట్టినట్లుగా పిలుస్తారు. ఇదేమీ అర్దం కాని శివుడు...దేవసేనను అసలు తాను ఎవరు...ఎందుకు వాళ్లంతా అలా పిలుస్తున్నారు అని అడుగుతాడు. అందుకు ఆమె అసలు ‘బాహుబలి' ఎవరు అనే విషయం పై ప్లాష్ బ్యాక్ చెప్తుంది. ఇంతకీ బాహుబలి ఎవరు..అతనికి భల్లాల దేముడు కు విరోధం ఏమిటి... గతంలో అసలు ఏమైంది..క్లైమాక్స్ లో ఉన్న ట్విస్ట్ ఏమిటీ వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+