X
తెలుగు » సినిమాలు » బాహుబలి
బాహుబలి

బాహుబలి

Action | Romance | 10 Jul 2015 | U/A |
Telugu

2.5 /5 Users

3.5 /5 Filmibeat

బాహుబలి స్టోరీ

బాహుబలి సినిమా ను ఒక  పౌరానిక యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, సుదీప్‌, సత్యరాజ్‌, రమ్యకృష్ణ, అడివి శేష్‌, నాజర్‌, తనికెళ్ల భరణి, సుబ్బరాజు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎస్ ఎస్ రాజమౌళి నిర్వహించారు మరియు నిర్మాతలు: ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు. కథ  'వంద మందిని చంపితే వీరుడు అవుతాడు...ఒక్కరిని కాపాడితే దేవుడు అవుతాడు' అలాంటి దేముడి కథే ‘బాహుబలి' . శివుడు (ప్రభాస్) మహిష్మతి రాజ్యానికి వారసుడు. అయితే పసిగుడ్డుగా ఉన్నప్పుడే అక్కడ రాజ కుటుంబంలోని అంతర్గత కుట్రకు బలి అవ్వబోయి సాహసవంతురాలైన శివగామి(రమ్యకృష్ణ) చేత రక్షించబడి, ఓ గిరిజన తెగలో పెరుగి పెద్దవుతాడు. వయిస్సుకి వచ్చిన శివుడు అవంతక(తమన్నా) కి ఆకర్షితుడు అవుతాడు. ఇంతకీ అవంతక ఏం చేస్తుంది అంటే... తమ రాజ్యంపు రాజు భల్లాల దేముడు (రానా) కి వ్యతిరేకంగా...మరి కొంత మంది తో కలిసి గొరిల్లా పద్దతిలో పోరాటం చేస్తూంటుంది. ఆమె లక్ష్యం భల్లాల దేముడు చేతిలో బంధీగా అయిన దేవసేన(అనుష్క)ని రక్షించటం. ఆమెను ప్రేమించిన శివుడు ... ఆ లక్ష్యాన్ని తను నెరవేర్చతానని భుజాన వేసుకుంటాడు. అందులో భాగంగా దేవసేన ను కట్టిపారేసి, హింసిస్తున్న రాజ్యం బయిలుదేరతాడు. అక్కడ వెళ్లాక..అక్కడ జనం అతన్ని ‘బాహుబలి' అని గుర్తుపట్టినట్లుగా పిలుస్తారు. ఇదేమీ అర్దం కాని శివుడు...దేవసేనను అసలు తాను ఎవరు...ఎందుకు వాళ్లంతా అలా పిలుస్తున్నారు అని అడుగుతాడు. అందుకు ఆమె అసలు ‘బాహుబలి' ఎవరు అనే విషయం పై ప్లాష్ బ్యాక్ చెప్తుంది. ఇంతకీ బాహుబలి ఎవరు..అతనికి భల్లాల దేముడు కు విరోధం ఏమిటి... గతంలో అసలు ఏమైంది..క్లైమాక్స్ లో ఉన్న ట్విస్ట్ ఏమిటీ వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

బాహుబలి కాస్ట్ & క్రూ

బాహుబలి సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎస్ ఎస్ రాజమౌళి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి
నిర్మాత సొభు యర్లగడ్డ, ప్రసాద్ దేవినేని
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బాహుబలి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
రాజమౌళి చిత్రాలలో సాధారణంగా ఇంటర్వెల్ బ్లాక్,క్లైమాక్స్ హై ఎమోషన్ తో నిండి ఉంటాయి. అలాగే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చి దిద్దేందుకు కామెడీ, రొమాన్స్ కూడా జాగ్రత్తలు తీసుకుని కలుపుతూంటాడు. ఈ సారి ఆ ఫార్ములాని రాజమౌళి ఈ సినిమాకు వదిలేసారు. ఎక్కడా కామెడీ అనేది లేకుండా చేసారు. రొమాన్స్ విషయానికి వస్తే ఉందా అంటే ఉంది..లేదు అంటే లేదు అన్నట్లుగా ఉన్నాయి సీన్స్. ఇక ఇంటర్వెల్ బ్లాక్ లో అసలు కిక్కే లేదు. క్లైమాక్స్ లో సస్పెన్స్ పెట్టి సెకండ్ పార్ట్ అని తేల్చేసాడు. దానికి తోడు సెకండాఫ్ లో వచ్చే పెద్ద యుద్దం ఎపిసోడ్ ని కావాలని పెట్టినట్లు ఉంది కానీ కథ డిమాండ్ చేసి కనపడదు. అందులోనూ ఆ యుద్దంలో కనిపించే కాలకేయుడు(ప్రభాకర్) ఎవరు...వాళ్లు మూలంగా ఏమి నష్టం జరిగింది అనేది ముందుగా చూపలేదు. దాంతో వారి గురించి ఓ డైలాగు చెప్పి యుద్దం ప్రారంభించంటంతో ఎమోషన్ మిస్సైన ఫీలింగ్ వచ్చింది. కాలకేయుడు ఓడితే ఏమిటి..గెలిస్తే ఏమిటి అనిపించింది. గతంలో ఇలాంటి సీన్ పెట్టాలంటే రాజమౌళి ఖచ్చితంగా ఆ నెగిటివ్ క్యారెక్టర్ ని పూర్తి స్ధాయిలో నెగిటివ్ గా ఎస్టాబ్లిష్ చేసేవారు. ఈ సారి ఎందుకనో డైలాగుతో, గెటప్ తో సరిపెట్టారు. దాంతో ఆ పెద్ద ఎపిసోడ్ పెద్ద ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది.

బాహుబలి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

బాహుబలి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+