బ్యాక్ డోర్ సినిమా డ్రామా, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పూర్ణ, తేజ త్రిపురాన తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కర్రీ బాలాజీ వహించారు. నిర్మాత బి శ్రీనివాస రెడ్డి నిర్మించారు. సంగీతం ప్రణవ్ అందించారు.
కథ
ఇద్దరు పిల్లలు ఉన్న అంజలి (పూర్ణ) ఓ బిజినెస్‌మెన్ భార్య. భర్త వ్యాపార వ్యవహారాలతో బిజీగా ఉండటం, పిల్లలు స్కూల్‌కు వెళ్లడంతో ఇంట్లో ఒంటరి జీవితాన్ని గడుపుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వివాహ వేడుకలో పరిచయమైన అరుణ్ (తేజా త్రిపురాణ) ఆకర్షణకు గురి అవుతుంది. అరుణ్ మాట్లాడే తీరు, మాటలకు అంజలి ఫిదా అవుతుంది. ఆ పరిచయం వారిద్దరిని మానసికంగా దగ్గరకు చేస్తుంది. అయితే అంజలి అందానికి ముగ్దుడైన అరుణ్ ఆమెతో శారీరక అనుభవాన్ని పొందాలనుకొంటాడు. కానీ అరుణ్ కోరికకు అంజలి అడ్డుకట్టవేస్తూ తప్పించుకొంటూ ఉంటుంది. అయితే అప్పటికే ఒకరికి భార్య అయిన అంజలి తనకంటే చిన్నవాడైన అరుణ్‌కు ఎందుకు ఆకర్షితురాలైంది. అరుణ్‌ను ఇష్టపడిన అంజలి తన బలహీనతలను అణిచివేసిందా? అరుణ్ కోరికకు అంజలి దాసోహమైందా? లేక అరుణ్‌ను హద్దు దాటకుండా ఎలా కట్టడి చేసింది. అరుణ్, అంజలి రిలేషన్ చివరకు ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అనే ప్రశ్నలకు భావోద్వేగమైన సమాధానమే బ్యాక్ డోర్ సినిమా కథ.