twitter

    బంగార్రాజు స్టోరి

    బంగార్రాజు సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణన్, కృతి శెట్టి తదితరులు నటించారు. ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ  దర్శకత్వం వహించారు. నాగార్జున నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. 

    కథ
    రాము (నాగార్జున) సీత (లావణ్య త్రిపాఠి) కాపురాన్ని చక్కదిద్దిన బంగార్రాజు (నాగార్జున)కు నేరుగా స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది. అయితే సీత ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చి చనిపోవడంతో రాము జీవితంలో ఊహించిన సంఘటన చోటు చేసుకొంటుంది. తన కుమారుడికి బంగార్రాజు ( నాగచైతన్య) అని నామకరణం చేసి.. సీత మరణంతో కలిగిన బాధను మరిచిపోవడానికి రాము అమెరికా వెళ్లిపోతాడు. బంగార్రాజు పెరిగి పెద్ద అయిన తర్వాత సత్తెమ్మ మరణించడంతో బంగార్రాజు ఒంటరివాడైపోతాడు. శివపురంలో రమేష్ (రావు రమేష్) కూతురు నాగలక్ష్మీ (సర్పంచ్) ఎన్నికవుతుంది. మరదలు నాగలక్ష్మితో చిన్న బంగార్రాజుకు ఎప్పుడు చిలిపి తగాదాలే. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న బంగార్రాజు ప్రాణాలకు ముప్పు కలగడంతో బంగార్రాజు మళ్లీ శివపురంకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. స్వర్గలోకంలో సత్తెమ్మతో జీవితాన్ని ఆస్వాదిస్తున్న బంగార్రాజకు మళ్లీ శివపురంకు రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? చిన్న బంగార్రాజు ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లింది? చిన్న బంగార్రాజు ప్రాణాలను బంగార్రాజు కాపాడానికి ఎలాంటి ఎత్తులు వేశాడు. నాగలక్ష్మి, చిన్న బంగార్రాజు చిలిపి తగాదాలకు ఎలా చెక్ పడింది. చిన్న బంగార్రాజు అంటే కోపం ఉండే నాగలక్ష్మికి ఎలాంటి పరిస్థితుల్లో ప్రేమ కలిగింది? నాగలక్ష్మి అంటే ఇష్టం కలుగడానికి చిన్న బంగర్రాజుకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? నాగలక్ష్మి, చిన్న బంగార్రాజు పెళ్లికి రానని చెప్పిన రాము అమెరికా నుంచి ఎందుకు వచ్చాడు? చిన బంగార్రాజు ప్రాణాలకు ఏర్పడిని ముప్పును బంగార్రాజు, రాము ఎలా తొలగించారు అనే ప్రశ్నలకు సమాధానమే బంగార్రాజు సినిమా కథ.

    **Note:Hey! Would you like to share the story of the movie బంగార్రాజు with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X