బంగారు కోడి పెట్ట సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నవదీప్, స్వాతి రెడ్డి,సంతోష్, రామ్, లక్ష్మణ్, సంచాలన తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాజ్ పిప్పళ్ళ నిర్వహించారు మరియు నిర్మాత సునీత థాటే నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మహేష్ శంకర్ స్వరాలు సమకుర్చారు.
కథ
మిడిల్ క్లాస్ అమ్మాయి భాను(కలర్స్ స్వాతి) ఓ రోబిరీ ప్లాన్ చేస్తుంది. తను పనిచేసే ఎనర్జీ డ్రింక్ కంపెనీ వారు లక్కీ డ్రా విజేతలకు పంపే బంగారు బిస్కట్స్,కాయిన్స్ ని తనతో పాటు పనిచేసే వంశీ(నవదీప్)తో కలిసి లేపేయాలనుకుంటుంది. అయితే అనుకున్నది అనుకున్నట్లు అయితే అది కథ ఎందుకవుతుంది... అనుకోని అవాంతరాలు వేరే సబ్ ప్లాట్స్ రూపంలో కనెక్టు అవుతాయి. చివరకు వారు దొంగతనం పూర్తి చేయగలిగారా అన్నది మిగతా కథ..కథనం.