బీరువా సినిమా యాక్షన్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో
సందీఫ్ కిషన్, సురభి, మరియు నరేశ్, సప్తగిరి, ముకెష్ రిషి, వీళ్ళందరు ముఖ్య పాత్రాలలో నటించారు. కల్మిని దర్శకత్వం వహిస్తున్నారు, ఉషా కిరణ్ ప్రోడక్షన్ లో రామోజిరావు నిర్మించారు. సంగీతదర్శకుడు తమన్ యస్ యస్ స్వరాలు సమకుర్చారు.
కథ
కథ విషయానికొస్తే...హైదరాబాద్‌లో ఇండస్ట్రియలిస్ట్ అయిన సూర్యనారాయణ(నరేష్) కొడుకు సంజు(సందీప్ కిషన్), భార్య అనిత(అనితా చౌదరి) ఉంటాడు. సంజు ఎప్పుడూ తన అల్లరితో తండ్రికి బిపి పెంచుతుంటాడు. ఓ సందర్భంలో విజయవాడకి చెందిన ఒక వ్యక్తి చేతిలో 40 కోట్లు మోసపోయిన సూర్యనారాయణకి ఏం చేయాలో తెలియదు. దాంతో సంజు సలహాపై విజయవాడను శాసించే పెద్ద మనిషి ఆది కేశవులు నాయుడు(ముకేష్ రుషి) సాయం కోరడానికి అక్కడకి సూర్యనారాయణ, సంజు వెళతారు. అక్కడ ఆదికేశవులు కూతురు స్వాతి(సురభి)ని చూసి ప్రేమలో పడతాడు సంజు. స్వాతి కూడా సంజుని ఇష్టపడుతుంది. బీరువా సహాయంతో సంజు తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...