X
బెజవాడ
Action | 01 Dec 2011 | A |
Telugu

బెజవాడ స్టోరీ

బెజవాడ సినిమా యాక్షన్  ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగచైతన్య, అమలా పాల్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ప్రభు, ముకుల్‌దేవ్‌, అజయ్‌, అభిమన్యు సింగ్‌, సత్యప్రకాష్‌, అంజనాసుఖాని, శుభలేఖ సుధాకర్‌ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమా కి కధ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: వివేక్‌కృష్ణ నిర్వహించారు మరియు నిర్మాతలు: రామ్‌గోపాల్‌ వర్మ, కిరణ్‌ కుమార్‌ కోనేరు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకులు అమర్ మోహ్లి, ప్రదీప్ కోనేరు, ధరమ్ సందీప్, విక్రమ్, భూపి తతుల్ స్వరాలు సమకుర్చారు.

కథ

శివకృష్ణ(నాగచైతన్య)ఓ కాలేజి స్టూడెంట్(ఎప్పుడూ క్లాసులుకి వెళ్లినట్లు చూడలేదేం అని అడగొద్దు).అతను సిటీ కమీషనర్(ఆహుతి ప్రసాద్)కూతురు గీతాంజలి(అమలా పౌల్)ని ప్రేమిస్తూంటాడు.ఈ ప్రేమాయణం ఇలా ఉంటే శివకృష్ణ అన్నయ్య విజయ కృష్ణ(ముకుల్ దేవ్) విజయవాడ గాడ్ ఫాదర్ కాళి (ప్రభు)కి నమ్మిన బంటు.అయితే కాళికి తన తమ్ముడు శంకర్(అబిమన్యు సింగ్)కంటే కూడా విజయ కృష్ణ అంటే నే అబిమానం.దాంతో రగిలిపోయిన శంకర్ తన అన్న కాళిని,ఆ తర్వాత విజయకృష్ణని చంపేసి తనే గాడ్ ఫాధర్ అవుతాడు. అప్పుడు తన అన్నని చంపిన వారిపై పగ తీర్చుకోవటానికి మన కాలేజి స్టూడెంట్ శివకృష్ణ ఆవేశంగా బయిలు దేరతాడు. అప్పుడు ఏం జరిగింది.ఎలా తన ప్రతీకార జ్వాలలలో సిటిని మండించాడు అనేది మిగతా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+