భాగ్యనగరవీధుల్లో సినిమా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీనివాసరెడ్డి, డొల్లిషా, సత్య, షకలక శంకర్, హైపర్ ఆది, చిత్రం శ్రీను, సుమన్ శెట్టి, రఘు బాబు, ఝాన్సీ, సత్యం రమేష్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: భరణి కె ధరణ్, సంగీతం: సాకేత్ కొమండూరి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: పరమ్ సూర్యాన్షు, నిర్మాత, దర్శకత్వం: .శ్రీనివాస్ రెడ్డి.
కథ
శ్రీను (శ్రీనివాసరెడ్డి), సత్య (జోజో), షకలక శంకర్ (పీటర్) ముగ్గురు మంచి ఫ్రెండ్స్. ముగ్గురికి యాక్టింగ్ అంటే ఇష్టం. ఆర్థికంగా పెద్దగా సపోర్ట్ లేకపోయినా అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఒక యూట్యూబ్ ఛానల్‌లో నటించే అవకాశం రావడంతో డెమో షూట్ చేసి ఇస్తారు. అయితే, ఆ షార్ట్ ఫిల్మ్‌లో ఒక అమ్మాయి కూడా ఉంటే బాగా వర్కౌట్ అవుతుంది అని ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్పడంతో కోకిల(డాలీ షా) అనే పిచ్చి అమ్మాయిని తీసుకువచ్చి ఫిల్మ్ డైరెక్టర్ దగ్గరికి తీసుకువెళతారు. బాలయ్య - బోయపాటి నూతన చిత్రం ప్రారంభం ఈ క్రమంలో శ్రీనుకి భూటాన్ లాటరీలో రెండు కోట్లు ప్రైజ్ మనీ వస్తుంది. ఆ టికెట్ కోసం వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో శ్రీను, జోజో, పీటర్ డ్రగ్స్ కేసులో ఇరుక్కొని అరెస్ట్ అవుతారు.. అసలు వీరు అందులో ఎందుకు ఇరుకున్నారు. ఆ కోకిల కథ ఏమైంది? భూటాన్ లాటరీలో గెలుచుకున్న డబ్బులు వచ్చాయా? లేదా ? అంటే సినిమా చూడాల్సిందే..