X
Home టాప్ లిస్టింగ్

పెళ్లి వయసు దాటినా.. పెళ్లి వైపు చూడని స్టార్ హీరోయిన్స్..!

Author Administrator | Updated: Thursday, July 13, 2023, 05:03 PM [IST]

హీరోయిన్లు తక్కువ వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. కనీసం వాళ్లకు 35 ఏళ్ల వయసు దాటితేనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనే సామెతను వాళ్ళు ఫాలో అవుతూ..వరుస ఆఫర్లు వస్తున్నప్పుడు పెళ్లి గురించి ఆలోచించకుండా ఎక్కువ సినిమాల్లో నటించి ఆస్తిపాస్తులను, పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవాలని వారు భావిస్తూ ఉంటారు. పెళ్లి చేసుకుంటే అవకాశాలు ఎక్కడ తగ్గిపోతాయో అనే ఉద్దేశంతో వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి తొందరపడరు. పెళ్లి వయసు దాటినా ఇప్పటి వరకూ పెళ్లి వైపు కూడా చూడని టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ గురించి ఇప్పుడు మీ కోసం


cover image
తాప్సీ పన్ను
1

ఝుమ్మంది నాదం చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన తాప్సీ. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ గా రాణిస్తోంది. అయితే 35 ఏళ్లు దాటినా ఇంతవరకూ అమ్మడు పెళ్ళి చేసుకోలేదు. 

శ్రుతిహసన్
2

శృతి హాసన్  గబ్బర్ సింగ్ సినిమా తో హిట్ కొట్టింది. తెలుగు, తమిళ్, హిందీ భాషాల సినిమాల్లో బిజీగా వుంది. శృతి హాసన్ వయస్సు కూడా 37 ఏళ్ళు దాటిపోయింది. అయినా సరే ఇంకా మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్ట లేదు.

అనుష్క శెట్టి
3

నాలుగు పదులు దాటినా పెళ్ళి గురించి ఆలోచించని హీరోయిన్లలో అనుష్క శెట్టి ముందు వరుసలో ఉంటుంది. 'సూపర్' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన స్వీటీ.. దాదాపు 15 ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఈ బ్యూటీ ప్రస్తుత వయస్సు 41 ఏళ్ళు. ఇప్పటికి పెళ్లి చేసుకోలేదు. 

త్రిష కృష్ణన్
4

గత రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న త్రిష.. ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతోంది. అయితే 39 ఏళ్లు వచ్చినా అమ్మడు ఇంకా పెళ్ళి చేసుకోలేదు.

టబు
5

సీనియర్ నటి టబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో మాత్రమే కాక తమిళ, హిందీ, మలయాళ చిత్రాలతో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుందిటబు కూలి నెం 1 సినిమా తో పరిచయం అయ్యంది. టబు కి ఇప్పుడు 50 సంవత్సరాలు అయిన ఇంకా పెళ్లి కాలేదు. 

నగ్మ
6

నగ్మ తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటించింది.  ఘరానామొగుడు, కిల్లర్, కొండపల్లి రాజా, ముగ్గురు మొనగాళ్ళు, సూపర్ పోలీస్, రక్షావోడు వంటి హిట్ చిత్రాల్లో నటించింది. 40 ప్లస్ వచ్చినా ఇంకా పెళ్లి కాలేదు. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+