భీష్మ సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నితిన్, రష్మిక మందన్న, అనంత్ నాగ్, బ్రహ్మాజి, సంపత్ రాజ్, రఘు బాబు, వెన్నెల కిశోర్, నరేష్, అవంతిక మిశ్రా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వెంకీ కుడుముల వహించారు మరియు నిర్మాత నాగ వంశీ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సాగర్ మహతి అందించారు.
కథ
భీష్మ (నితిన్) ఎలాంటి లక్ష్యం లేకుండా జీవితంలో ఒక్క అమ్మాయి ప్రేమలోనైనా పడాలనే కోరికతో పలు రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చైత్ర (రష్మిక మందన్న) భీష్మ ఆర్గానిక్ కంపెనీలో పనిచేస్తుంటుంది. ఓ సందర్భంలో చైత్రతో భీష్మ పరిచయం ప్రేమగా మారుతుంది. ఇదిలా ఉండగా భీష్మ ఆర్గానిక్ కంపెనీ, ఫీల్డ్ సైన్స్ రెండు కంపెనీల మధ్య పోటీ వైరం ఉంటుంది. భీష్మ కంపెనీని తొక్కేయాలని ఫీల్డ్ కంపెనీ అధినేత (జిషు సేన్ గుప్తా) కుట్ర పన్నుతుంటాడు. ఆ క్రమంలో భీష్మ కంపెనీ అధినేత భీష్మ (అనంత నాగ్) తనకు వయసు పైబడటంతో తన వారసుడి కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో కనీసం డిగ్రీ పాస్ కానీ భీష్మ (నితిన్)ను కంపెనీ సీఈవోగా నియమిస్తాడు. 30 రోజుల్లో ప్రతిభను నిరూపించుకోవాలని సూచిస్తాడు. ఎలాంటి అర్హతలు లేని భీష్మ (నితిన్)ను సీఈవోగా నియమించడానికి కారణాలు ఏమిటి? 30 రోజుల్లో భీష్మ కంపెనీపై ఫీల్డ్ సైన్స్ కంపెనీ చేసే కుట్రల నుంచి ఎలా కాపాడాడు? తొలి చూపులోనే ప్రేమించిన చైత్ర ప్రేమను ఎలా పొందాడు? భీష్మ అంటేనే ఓ రకమైన అయిష్టాన్ని చైత్ర ఎందుకు పెంచుకొన్నది. చివరకు చైత్ర ప్రేమను ఎలా పొందాడు?, భీష్మ కంపెనీని ప్రత్యర్థి నుంచి ఎలా కాపాడాడు? చివరకు భీష్మ కంపెనీకి సీఈవోగా కావడానికి యువ భీష్ముడు ఎలాంటి పై ఎత్తులు వేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే భీష్మ సినిమా కథ.