బృందావనం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఎన్టీఆర్, కాజల్, సమంత, శ్రీహరి, ప్రకాష్ రాజ్, కోట, ముఖేష్ రుషి, వేణు మాధవ్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీ పైడిపల్లి నిర్వహించారు మరియు నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు తమన్ స్వరాలు సమకుర్చరు.
కథ
కృష్ణ అలియాస్ క్రిష్(ఎన్టీఆర్) సిటీలోని పెద్ద కోటీశ్వరుడు(ముఖేష్ రుషి) కొడుకు. ఖాలీగా ఉన్నప్పుడు ప్రెండ్స్ కి ప్రేమ పెళ్ళిళ్లు గట్రా చేస్తూ హ్యాపీగా బ్రతికేస్తున్న అతనికో గర్ల్ ప్రెండ్ ఇందు(సమంత). ఇక ఇందు కో క్లోజ్ ప్రెండ్ భూమి(కాజల్). భూమికో సమస్య వస్తుంది. చదువుకుంటున్న ఆమెకు బావ(అజయ్) తో తండ్రి(ప్రకాష్ రాజ్) ఇష్టంలేని పెళ్ళిని ఫిక్స్ చేస్తాడు. తండ్రికి ఎదురు చెప్పలేని ఆమె ఆ పెళ్లిని తప్పించుకోవటానికి తన తాత(కోట) సలహాతో తనకో భాయ్ ప్రెండ్ ఉన్నాడని అబద్దమాడుతుంది. దాంతో ఆమె తండ్రి ఆ భోయ్ ప్రెండ్ ని ఇంటికి రప్పించు అంటాడు. దాంతో ఆమె తన స్నేహితురాలు ఇందుని సంప్రదిస్తే..ఆమె తన భోయ్ ప్రెండ్ కృష్ణని ..భూమికి బోయ్ ప్రెండ్ గా వెళ్ళమని పురమాయిస్తుంది. తన ప్రియురాలు మాట జవదాటలేని కృష్ణ ..భూమి ఉన్న పల్లెకు బయిలు దేరి వెళతాడు. అక్కడ భూమిదో పెద్ద కుటుంబం. అందుకు తగ్గట్లే కుటుంబ తగాదాలు. అక్కడికి వెళ్లిన క్రిష్...తన తెలివితో ఆమె తండ్రికీ, బాబాయ్(శ్రీహరి)కీ ఉన్న తగువుని పరిష్కరించి,కలుపుతాడు. దాంతో ఇంప్రెస్ అయిన భూమి తండ్రి ...నా అల్లుడు నువ్వే అని క్రిష్ ని ప్రకటిస్తాడు.మరో ప్రక్క భూమి కూడా క్రిష్ తో ప్రేమలో పడిపోతుంది. ఈ లోగా ఇందు రంగంలోకి దిగుతుంది.ఇంతకీ ఆమె ఎవరూ...ఆమెకూ ఆ ఇంటికీ ఉన్న సంభందం ఏమిటీ... వీళ్ళద్దరి మధ్య ఇరుక్కుపోయిన క్రిష్ ఎలా బయిటపడ్డానేది తెరపై చూడాల్సిందే.