X
తెలుగు » సినిమాలు » బృందావనం
బృందావనం

బృందావనం

Action | Romance | 14 Oct 2010 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

బృందావనం స్టోరీ

బృందావనం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఎన్టీఆర్, కాజల్, సమంత, శ్రీహరి, ప్రకాష్ రాజ్, కోట, ముఖేష్ రుషి, వేణు మాధవ్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీ పైడిపల్లి నిర్వహించారు మరియు నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు తమన్ స్వరాలు సమకుర్చరు. కథ కృష్ణ అలియాస్ క్రిష్(ఎన్టీఆర్) సిటీలోని పెద్ద కోటీశ్వరుడు(ముఖేష్ రుషి) కొడుకు. ఖాలీగా ఉన్నప్పుడు ప్రెండ్స్ కి ప్రేమ పెళ్ళిళ్లు గట్రా చేస్తూ హ్యాపీగా బ్రతికేస్తున్న అతనికో గర్ల్ ప్రెండ్ ఇందు(సమంత). ఇక ఇందు కో క్లోజ్ ప్రెండ్ భూమి(కాజల్). భూమికో సమస్య వస్తుంది. చదువుకుంటున్న ఆమెకు బావ(అజయ్) తో తండ్రి(ప్రకాష్ రాజ్) ఇష్టంలేని పెళ్ళిని ఫిక్స్ చేస్తాడు. తండ్రికి ఎదురు చెప్పలేని ఆమె ఆ పెళ్లిని తప్పించుకోవటానికి తన తాత(కోట) సలహాతో తనకో భాయ్ ప్రెండ్ ఉన్నాడని అబద్దమాడుతుంది. దాంతో ఆమె తండ్రి ఆ భోయ్ ప్రెండ్ ని ఇంటికి రప్పించు అంటాడు. దాంతో ఆమె తన స్నేహితురాలు ఇందుని సంప్రదిస్తే..ఆమె తన భోయ్ ప్రెండ్ కృష్ణని ..భూమికి బోయ్ ప్రెండ్ గా వెళ్ళమని పురమాయిస్తుంది. తన ప్రియురాలు మాట జవదాటలేని కృష్ణ ..భూమి ఉన్న పల్లెకు బయిలు దేరి వెళతాడు. అక్కడ భూమిదో పెద్ద కుటుంబం. అందుకు తగ్గట్లే కుటుంబ తగాదాలు. అక్కడికి వెళ్లిన క్రిష్...తన తెలివితో ఆమె తండ్రికీ, బాబాయ్(శ్రీహరి)కీ ఉన్న తగువుని పరిష్కరించి,కలుపుతాడు. దాంతో ఇంప్రెస్ అయిన భూమి తండ్రి ...నా అల్లుడు నువ్వే అని క్రిష్ ని ప్రకటిస్తాడు.మరో ప్రక్క భూమి కూడా క్రిష్ తో ప్రేమలో పడిపోతుంది. ఈ లోగా ఇందు రంగంలోకి దిగుతుంది.ఇంతకీ ఆమె ఎవరూ...ఆమెకూ ఆ ఇంటికీ ఉన్న సంభందం ఏమిటీ... వీళ్ళద్దరి మధ్య ఇరుక్కుపోయిన క్రిష్ ఎలా బయిటపడ్డానేది తెరపై చూడాల్సిందే.
Read More

బృందావనం కాస్ట్ & క్రూ

బృందావనం సిబ్బంది సమాచారం

దర్శకత్వం వంశీ పైడిపల్లి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత దిల్ రాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బృందావనం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఫైనల్ గా ఎన్టీఆర్ ప్యామిలీలను కూడా తన ఫ్యాన్స్ జాబితాలో కలుపుకోవాలనే ప్రయత్నం ప్రారంభించటం బాగుంది. ఇక సినిమా రొటిన్ విషయాన్నే మూసగా చెప్పినా మసాలా కలిపి కాస్సేపు నవ్వుకునేటట్లు చేసారు కాబట్టి ఇబ్బంది లేదు. అలాగే పొటీ అనుకున్న మిగతా సినిమాలు భాక్సాఫీస్ వద్ద ప్లాప్ అవటం కూడా ఈ చిత్రానికి కలిసి వచ్చే అంశం. అసభ్యత,మితిమీరిన హింస లేదు కాబట్టి ఫ్యామిలీలు ఎంకరేజ్ చేయవచ్చు.అంతేగాక మిస్సమ్మ చిత్రంలోని బృందావనమిది చిత్రం పాటతో ప్రారంభించటం, చివర్లో పెద్ద ఎన్టీఆర్ కనిపించటం తెలుగువారికి నచ్చే మరో అంశం.

బృందావనం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

బృందావనం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+