బ్రదర్స్ యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సూర్య, కాజల్, వివేక్, సచిన్ కేడెకర్, తార, రవిప్రకాష్, శంకర్ కృష్ణమూర్తి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె వి ఆనంద్ నిర్వహించారు మరియు నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు హరిస్ జైరాజ్ స్వరాలు సమకుర్చారు.
కథ
మార్కెట్లో నెంబర్ వన్ ఎనర్జీ డ్రింక్ ఓనర్, జెనిటిక్ సైంటిస్ట్(సచిన్ కేడెకర్)కి అవిభక్త కవలలైన విమల్& అఖిల్ (సూర్య)జన్మిస్తారు. కవలలులో ఒకరు కమ్యూనిస్టు భావాలు కలవాడయితే, మరొకరు పూర్తి జాలీ టైప్. కంపెనీ ఎదుగుతూంటే ఎంతో మంది శత్రువులు తయారవుతూంటారు. ఓ రైవల్ కంపెనీ రష్యన్ స్పై ని పంపి ఆ డ్రింక్ ఫార్ములా లేపాయాలనుకుంటారు. మరో ప్రక్క విమల్ కు తమ తండ్రి కంపెనీలో ఏదో మోసం జరుగుతున్నట్లు డౌట్ వస్తుంది. అందుకు ప్రతిఫలం మరణం రూపంలో అనుభవిస్తాడు. దాంతో ఒంటిరిగా మిగిలిన అఖిల్ తన సోదరుడు గుండెని తనలో ట్రాన్స్ ప్లెంట్ చేసుకుని అతని మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం తన గర్లప్రెండ్ అంజలి(కాజల్)తో కలిసి యుక్రెయన్ వెళ్లి ఇన్విస్టిగేషన్ మొదలెడతాడు. ఆ క్రమంలో ఏం జరగింది. పగ తీర్చుకున్నాడా... అసలు విలన్స్ ఎవరు అనేది మిగతా కథ.