X
తెలుగు » సినిమాలు » బ్రదర్స్
బ్రదర్స్

బ్రదర్స్

Action | Romance | 12 Oct 2012 | U |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

బ్రదర్స్ స్టోరీ

బ్రదర్స్ యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సూర్య, కాజల్ , వివేక్, సచిన్ కేడెకర్, తార, రవిప్రకాష్, శంకర్ కృష్ణమూర్తి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె వి ఆనంద్ నిర్వహించారు మరియు నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు హరిస్ జైరాజ్ స్వరాలు సమకుర్చారు. కథ మార్కెట్లో నెంబర్ వన్ ఎనర్జీ డ్రింక్ ఓనర్, జెనిటిక్ సైంటిస్ట్(సచిన్ కేడెకర్)కి అవిభక్త కవలలైన విమల్& అఖిల్ (సూర్య)జన్మిస్తారు. కవలలులో ఒకరు కమ్యూనిస్టు భావాలు కలవాడయితే, మరొకరు పూర్తి జాలీ టైప్. కంపెనీ ఎదుగుతూంటే ఎంతో మంది శత్రువులు తయారవుతూంటారు. ఓ రైవల్ కంపెనీ రష్యన్ స్పై ని పంపి ఆ డ్రింక్ ఫార్ములా లేపాయాలనుకుంటారు. మరో ప్రక్క విమల్ కు తమ తండ్రి కంపెనీలో ఏదో మోసం జరుగుతున్నట్లు డౌట్ వస్తుంది. అందుకు ప్రతిఫలం మరణం రూపంలో అనుభవిస్తాడు. దాంతో ఒంటిరిగా మిగిలిన అఖిల్ తన సోదరుడు గుండెని తనలో ట్రాన్స్ ప్లెంట్ చేసుకుని అతని మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం తన గర్లప్రెండ్ అంజలి(కాజల్)తో కలిసి యుక్రెయన్ వెళ్లి ఇన్విస్టిగేషన్ మొదలెడతాడు. ఆ క్రమంలో ఏం జరగింది. పగ తీర్చుకున్నాడా... అసలు విలన్స్ ఎవరు అనేది మిగతా కథ.
Read More

బ్రదర్స్ కాస్ట్ & క్రూ

బ్రదర్స్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం కె వి ఆనంద్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం హారీష్ జయరాజ్
నిర్మాత బెల్లంకొండ సురేశ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బ్రదర్స్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఈ సినిమా చూస్తుంటే సూర్య తన సూపర్ హిట్ గజనీ లోంచి బయిటకి రాలేదా అనిపిస్తుంది. కొద్దిగా వెరీటీ, పూర్తిగా రెగ్యులర్ అనే స్కీమ్ లో వెళితే చాలు హిట్ కొట్టవచ్చు అని నమ్మిచేసిన సినిమాలా అనిపిస్తుంది. నిజానికి అవిభక్త కవలలుగా సూర్య తనదైన శైలిలో చెలరేగిపోయాడనే చెప్పాలి. అయితే కథ అతనికి సహకరించలేదు. సెవెంత్ సెన్స్ మాదిరిగానే ఈ సినిమా కూడా స్క్రీన్ టైమ్ మారేకొలదీ ధ్రిల్లర్ గా మారుతూ, ప్రేక్షకులను నిద్రలోకి జార్చే ప్రయత్నం చేసింది. ఇంటర్వెల్ దగ్గరకి వచ్చేసరికి.. అప్పటివరకూ బాగుందనుకుంటూ వచ్చిన కథ, కథనం ఒక్కసారిగా రెగ్యులర్ రొటీన్ పగ, ప్రతీకారం మార్కు గా మారిపోవటం ప్రేక్షకుడుని నిరాశపరుస్తుంది. అందులోనూ ఇన్వెస్టిగేషన్ డ్రామాల్లో హీరో చేసేదేమీ ఉండదు. సూర్య వంటి హీరో ఏదో చేస్తాడు అని ఊహించుకుని వచ్చినవారిని ఇబ్బందిపెడుతుంది. అందుకే ఫస్టాఫ్ బాగుందనిపించినా, సెంకండాఫ్ డ్రాబాక్ గా మారింది.

బ్రదర్స్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

బ్రదర్స్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+