బస్ స్టాప్ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రిన్స్, దివ్య, ఖన్నా, రావు రమేష్, అభి, హాసిక, గోపాల్‌సాయి, డి.ఎం.కె, సాయికుమార్ పంపన, రావిపల్లి రాంబాబు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి నిర్వహించారు మరియు నిర్మాతలు బెల్లంకోండ సురేష్, గణేష్ బాబు కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జెబి స్వరాలు సమకుర్చారు.
కథ
ఓ వయస్సు వచ్చాక... ఎంతో ప్రేమతో చూసుకునే పేరెంట్స్ ని కాదని,తాము ప్రేమించి వారితో సెటిల్ అవ్వాలనుకునే యువతరం కథగా ఈ చిత్రం సాగుతుంది. బాల్య స్నేహితులైన శ్రీను (ప్రిన్స్), శైలు (దివ్య) కొంత కాలం గ్యాప్ తర్వాత కాలేజీలో కలుసుకుంటారు. స్నేహం కాస్తా ప్రేమగా రూపొందుతుంది. శైలుకి అమ్మానాన్నలంటే చాలా గౌరవం. అలాంటి ఆ అమ్మాయి శ్రీను కోసం ఇంట్లో అబద్ధాలు చెప్పడం మొదలుపెడుతుంది. అది గమనించిన ఆమె తల్లి తండ్రులు కలవరపడతారు..కండీషన్స్ పెడతారు. అప్పుడు ఆమె ఏం నిర్ణయం తీసుకుంది అనేది మిగతా కథ. అలాగే సిమ్ కార్డులు మార్చినట్లు అమ్మాయిలను మార్చే కుర్రాడు, తమ లవర్ వేరే వారితో ప్రేమ కథ నడుపుతోందని తెలియక,తన ఇంట్లో దొంగతనాలు చేసి మరీ గిప్ట్ లు ఇచ్చే మరో కుర్రాడు వంటి మరో రెండు పాత్రల కథలు కూడా సిమిలర్ గా ఈ లవ్ స్టోరీ తో పాటు సాగుతూంటాయి.