చక్కిలిగింత (2014)
Release date
05 Dec 2014
genre
చక్కిలిగింత స్టోరి
చక్కిలిగింత సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుమంత్ అశ్విన్, రెహన, తదితరులు ప్రాధానమైన పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వేమారెడ్డి నిర్వహించారు, నిర్మాతలు సి హెచ్ నరసింహచారి, నరసింహరెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కీ జె మేయర్ స్వరాలు సమకుర్చారు.
కథ
కాలీజేలో చదువుకుంటున్న ఆడి(సుమంత్ అశ్విన్) కు కొన్ని నమ్మకాలు ఉంటాయి. అమ్మాయిలు వెంటపడి ప్రేమిస్తున్నామంటూ తిరిగితే ఆడపిల్లల దగ్గర అలుసైపోతామని..దాన్ని తను నమ్మటమే కాకుండా తన తోటి వాళ్లందరిమీదా రుద్దుతాడు. అమ్మాయిలతో మాట్లాడకూడదు..చూడకూడదు... అప్పుడు మన విలువ వారికి అర్దమవుతుందని వారికి నూరి పోస్తాడు. దాంతో కుర్రాళ్లంతా దాన్నే ఫాలో అయిపోవటంతో..అమ్మాయిలకు బెంగ పట్టుకుంటుంది. ప్రపంచంలో కుర్రాళ్లే కరువయ్యారన్నట్లు వీళ్లు మనని చూడటం లేదే అని తెగ ఫీలైపోతూంటారు. అప్పుడు వేరే కాలేజీనుంచి మన హీరోయిన్ అవంతిక (రెహన) దిగుతుంది. ఈ ఇంటర్నేషన్ సమస్యని పరిష్కరించటానికి... కుర్రాళ్ళందరినీ ఏకబిగిన చెడకొట్టిన వాడ్ని ప్రేమలో పడేస్తే అంతా ఒక దెబ్బకు సెట్ అయిపోతుందని ఆమె ఆడిని ప్రేమలో దించటానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఏం జరిగింది...ఆ కాలేజీ పరిస్ధితి ఏమైంది... హీరో మారాడా...చివరకి ఏమైంది వంటి మీకు తెలిసిన విషయాలే మరోసారి చూడాలంటే థియోటర్ కు వెళ్లాల్సిందే.
**Note:Hey! Would you like to share the story of the movie చక్కిలిగింత with us? Please send it to us ([email protected]).