twitter

    ఛలో స్టోరి

    ఛలో సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ సౌర్య, రష్మిక మండన్న, వెన్నెల కిశోర్, ప్రవీణ్, నరేష్, సత్య అక్కల, వైవా హర్ష, రఘుబాబు, పోసాని కృష్ణముళి, రాకేట్ రాఘవ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం వెంకి కుడుముల వహించారు మరియు నిర్మాతలు ఉషా మల్పూరి, శంకర ప్రసాద్ మల్పూరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సాగర్ మహాతి అందించారు.

    కథ

    హరి(నాగ శౌర్య)కు చిన్నప్పటి నుండి కొట్టడం లేదా కొట్టించుకోవడం అలవాటు. అందులోనే అతడికి ఆనందం ఉంటుంది. గొడవల్లో తలదూర్చడం అతడి హాబీ. కొడుకు ప్రవర్తనతో ఇబ్బంది పడుతున్న తల్లి దండ్రులు (ప్రగతి-సీనియర్ నరేష్)...... రజనీకాంత్ సినిమాలోని ఓ సీన్‌కు చూసి ఇన్స్‌స్పైర్ అయి గొడవలు ఎక్కువగా ఉండే ఆంధ్ర-తమిళనాడు బార్డర్‌లోని ‘తిరుప్పురం' అనే ఊరికి పంపిస్తారు. ఆ ఊర్లో తెలుగు-తమిళ వర్గాలు రోజూ గొడవపడుతూ ఉంటారు. ఇక్కడ నిత్యం గొడవలు చూసైనా గొడవలపై విరక్తి చెంది కొడుకు మారుతాడు అనేది వారి ఆశ. ‘తిరుప్పురం' ఊర్లో అడుగు పెట్టగానే హరి తెలుగువాడని తెలిసి అతడిని చంపాలని ప్రయత్నిస్తారు తమిళ వర్గీయులు. వారి నుండి ఎలాగో తప్పించుకున్న హీరో..... తనకు తెలియకుండానే తమను శత్రువులుగా భావించే తమిళ వర్గానికి చెందిన అమ్మాయి కార్తీక(రష్మిక మండన్న)ను ప్రేమిస్తాడు. మరి తెలుగోళ్లంటే వారిని హీరో ఎలా కన్విన్స్ చేశాడు? ఒకప్పుడు అన్నదమ్ముల్లా ఉన్న ఆ ఊరి తెలుగు, తమిళ ప్రజలు చంపుకునేంత బద్దశత్రువులు కావడానికి కారణమేంటి? అనేది తెరపై చూడాల్సిందే.

    **Note:Hey! Would you like to share the story of the movie ఛలో with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X