చందమామకథలు (2014)(U/A)
Release date
25 Apr 2014
genre
చందమామకథలు స్టోరి
చందమామకథలు సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో లక్ష్మి మంచు, కిశోర్, చైతన్య, శ్యామిలి అగర్వల్, నరేష్, సౌమ్య, అమణి, రిచ పనై, అమ్రిత రావు, కృష్ణుడు, రిషి, సురేఖ వాణి, నాగ సౌర్య, వెన్నెల కిశోర్, క్రిష్ణేశ్వర రావు, అభిజిత్ పుండ్ల, కోండవలస తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రవీణ సత్తారు నిర్వహించారు మరియు నిర్మాత చానిక్య బోనేటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కి జె మేయర్ స్వరాలు సమకుర్చారు.
కథ
వెంకటేశ్వరరావు (కృష్ణుడు) సాఫ్ట్ వేర్ ఇంజినీర్. పెళ్లి కాక ఇబ్బందులు పడుతుంటారు. ఎలాగైనా 30 దాటేలోగా పెళ్లి చేసుకోవాలనే లక్ష్యంతో ఉంటాడు.
లీసా (లక్ష్మీ ప్రసన్న) ఓ టాప్ మోడల్. కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదిగి పతనం అవుతుంది. దీంతో పాటు ప్రియుడు (ఫృథ్వీ) వదిలి వెళ్లి పోతాడు. దీంతో మద్యం, సిగరెట్లకు అలవాటు అవుతుంది. పాత బస్తీలో ఉండే అష్రఫ్ (అభిజిత్) ప్రియురాలు హసీనా (రిచాపనయ్) ఆస్తి కోసం ఓ దుబాయ్ కుర్రాడిని పెళ్లి చేసుకుంటుంది. చైతన్య కృష్ణ కాలేజ్ స్టూడెంట్. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న తన క్లామ్ మేట్ ని ప్రేమిస్తాడు. ఇద్దరూ కలిసి పారిపోవాలనుకుంటారు. పల్లెటూర్లో గాలితిరుగుడు తిరిగే రఘు(నాగ శౌర్య) పక్క వీధిలో ఉండే గౌరీ (అమిత రావు) ని ప్రేమిస్తాడు. ఓ బిచ్చగాడు (కృష్ణేశ్వరరావు) సొంతింటి కల తీర్చుకునేందుకు రూపాయి రూపాయి కూడబెడతాడు. అమెరికా నుంచి ఇండియా వచ్చిన మోహన్ (నరేష్) భర్త దూరమైన తన మాజీ ప్రియురాలు సరిత (ఆమని)కు దగ్గరవుతాడు. ఇద్దరూ కలిసి జీవించాలనుకుంటారు. ఒకే కాలేజీలో చదువుకునే పేద కుర్రాడు రఘు (చైతన్య కృష్ణ) డబ్బున్న రేణు(షామిని అగర్వాల్)ని లొంగదీసుకుని వాళ్ల ఇంటి అల్లుడు కావాలనే ప్లాన్లో ఉంటాడు.
**Note:Hey! Would you like to share the story of the movie చందమామకథలు with us? Please send it to us ([email protected]).