చంటిగాడు సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలాదిత్య, సుహాసిని, రాజీవ్ కనకాల, ఆహుతి ప్రసాద్, శరణ్య పొన్వనం, రాజీవ్ కనకాల, ఎస్ బి శ్రీరామ్, బిక్షు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బి జియ నిర్వహించారు మరియు నిర్మాత బి ఎ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శాకుడు వందేమాతరం శ్రీనివాస్ స్వరాలు సమకుర్చరు.
కథ
టెన్త్ పాసయ్యి ఇంటర్ కు వచ్చిన చంటిగాడు (బాలాదిత్య) మామూలు కుటుంబానికి చెందినవాడు. వాళ్ళమ్మ గుడిలో వంటచేస్తుంది. ఊరిలో జమీందారు తరహాలో ఉండే రెడ్డప్ప (ఆహుతి ప్రసాద్) తన కూతురి సీతని (సుహాసిని) గారాబంగా పెంచుతాడు. తొలిసారి పక్క ఊరికి ఇంటర్ కోసం పంపుతాడు. రోజూ పడవలో వెళ్ళే చంటిగాడికి, సీతకి మధ్య ఇక ప్రేమ మొదలవుతుంది. చంటిగాడు స్నేహితుల బృందంలో ఉండే ఒకడు తన ప్రియురాలని రాత్రిపూట తీసుకురమ్మని ఆ గ్యాంగ్ ను పురమాయిస్తాడు.
వాళ్ళు పొరపాటున వాడి ప్రియురాలు బదలు సీతను తీసుకొస్తారు. సీతను తీసుకొచ్చామని తెలిసి..వాళ్ళు పారిపోతారు. ఆ అడవిలో అలా సీత, చంటిగాడు ఉండిపోతారు. వీరికోసం రెడ్డప్ప వెతుకుతుండగా, చిన్నప్పుడు సీత కోసం తన భార్యను చంపి జైలుకెళ్ళిన మేనళ్ళుడు ఎంటర్ అవుతాడు. సీతను పెళ్ళి చేసుకునేందుకు వాడు ప్రయత్నం చేస్తాడు. చివరికి సీత, చంటిగాడు ఎలా పెళ్ళి చేసుకుంటారనేది చిత్రం.