X
తెలుగు » సినిమాలు » చంటిగాడు
చంటిగాడు

చంటిగాడు

Romance | 26 Nov 2003 |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

చంటిగాడు స్టోరీ

చంటిగాడు సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలాదిత్య, సుహాసిని , రాజీవ్‌ కనకాల, ఆహుతి ప్రసాద్‌, శరణ్య పొన్వనం, రాజీవ్ కనకాల, ఎస్ బి శ్రీరామ్, బిక్షు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బి జియ నిర్వహించారు మరియు నిర్మాత బి ఎ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శాకుడు వందేమాతరం శ్రీనివాస్ స్వరాలు సమకుర్చరు. కథ టెన్త్‌ పాసయ్యి ఇంటర్‌ కు వచ్చిన చంటిగాడు (బాలాదిత్య) మామూలు కుటుంబానికి చెందినవాడు. వాళ్ళమ్మ గుడిలో వంటచేస్తుంది. ఊరిలో జమీందారు తరహాలో ఉండే రెడ్డప్ప (ఆహుతి ప్రసాద్‌) తన కూతురి సీతని (సుహాసిని) గారాబంగా పెంచుతాడు. తొలిసారి పక్క ఊరికి ఇంటర్‌ కోసం పంపుతాడు. రోజూ పడవలో వెళ్ళే చంటిగాడికి, సీతకి మధ్య ఇక ప్రేమ మొదలవుతుంది. చంటిగాడు స్నేహితుల బృందంలో ఉండే ఒకడు తన ప్రియురాలని రాత్రిపూట తీసుకురమ్మని ఆ గ్యాంగ్‌ ను పురమాయిస్తాడు. వాళ్ళు పొరపాటున వాడి ప్రియురాలు బదలు సీతను తీసుకొస్తారు. సీతను తీసుకొచ్చామని తెలిసి..వాళ్ళు పారిపోతారు. ఆ అడవిలో అలా సీత, చంటిగాడు ఉండిపోతారు. వీరికోసం రెడ్డప్ప వెతుకుతుండగా, చిన్నప్పుడు సీత కోసం తన భార్యను చంపి జైలుకెళ్ళిన మేనళ్ళుడు ఎంటర్‌ అవుతాడు. సీతను పెళ్ళి చేసుకునేందుకు వాడు ప్రయత్నం చేస్తాడు. చివరికి సీత, చంటిగాడు ఎలా పెళ్ళి చేసుకుంటారనేది చిత్రం.
Read More

చంటిగాడు కాస్ట్ & క్రూ

చంటిగాడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం జయ బి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నిర్మాత రాజు బి ఎ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

చంటిగాడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పదోతరగతి దాటి ఇంటర్లోకి అడుగుపెట్టిన టీనేజ్‌ జంట ప్రేమకథ. సెకాంఢాప్‌ బోర్‌. ఫస్ట్‌ హాఫ్‌ ఫర్వాలేదు. మొత్తమ్మీద సాధారణంగా సాగిన చిత్రమిది. 'సూపర్‌ హిట్‌' సినిమా పత్రిక సహసంపాదకురాలు జయ దర్శకురాలిగా మారి రూపొందించిన తొలి చిత్రం ఇది. సినిమా సాదాసీదాగా మొదలయ్యి మధ్యలో మంచి ఆసక్తిని పెంచుతుంది. చివర్లో సాదాసీదాగానే ముగుస్తుంది. తేజ రూపొందించిన 'జయం'కి ఈ సినిమాకు పోలీకలు చాలా ఉన్నాయి. కాకపోతే, 'జయం' చంటిగాడుతో పోలిస్తే చాలా బెటర్‌, ఎంటర్‌ టైనర్‌. 'చంటిగాడు'లో పూర్ణ ఫోటోగ్రఫీ, హీరోయిన్‌ సుహాసిని హైలెట్‌ అని చెప్పాలి. తెలుగు అమ్మాయైన సుహాసినికి మంచి భవిష్యత్‌ ఉంది.

చంటిగాడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

చంటిగాడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+