X
Home టాప్ లిస్టింగ్

2022 అక్టోబర్ నెలలో విడుదలయ్యే తెలుగు సినిమాలు ఇవే..!

Author Administrator | Updated: Thursday, September 29, 2022, 10:09 AM [IST]

2022 అక్టోబర్ నెలలో దసరా, దీపావళి పండుగలు వున్నాయి. ఒకే నేనెలలో రెండు ఫెస్టివల్స్ అంటే ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాలు కూడా పెద్ద లిస్ట్ ఉంటుంది. అక్టోబర్ నెలలో విడుదలయ్యే తెలుగు సినిమాలు లిస్ట్ మీ కోసం


cover image
గాడ్ ఫాదర్
1

 మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ  అక్టోబర్ 5 వ తేదీన కానుంది   

ది ఘోస్ట్‌
2

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా తెరకెక్కిన ది ఘోస్ట్ మూవీ ని కూడా అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించాడు.

స్వాతి ముత్యం
3

'స్వాతి ముత్యం' సినిమాతో బెల్లంకొండ గణేశ్ హీరోగా పరిచయమవుతున్నాడు. సితార బ్యానర్ తో కలిసి త్రివిక్రమ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. గణేశ్ జోడీగా వర్ష బొల్లమ్మ ఈ సినిమాలో అలరించనుంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. లక్ష్మణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేస్తున్నారు.

క్రేజీ ఫెలో
4

ఆది సాయి కుమార్, దిగంగన  సూర్యవంశీ, మర్నా మీనన్, సప్తగిరి తదితరులు నటించిన  క్రేజీ ఫెలో మూవీ అక్టోబర్ 14న రిలీస్ కానుంది 

బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్
5

విశ్వంత్ దుద్దుంపూడి, మాళవిక స‌తీష‌న్ హీరోహీరోయిన్లుగా సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి  మూవీ అక్టోబర్ 14వ తేదీన విడుదల కానుంది 

 

ఓరి దేవుడా
6

తమిళంలో సూపర్ హిట్ అయిన ” ఓ మై కడువలే” చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఒరిజినల్ వర్షన్ ను తెరకెక్కించిన అశ్వత్ మరిముత్తు రీమేక్ చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ దేవుడి పాత్రలో నటించారు. ఈ సినిమాను  అక్టోబర్ 21న  విడుదల చేయనున్నారు

 

ప్రిన్స్
7

శివ‌ నేరుగా తెలుగులో ‘ప్రిన్స్’ అనే ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌తో ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు. ‘జాతిర‌త్నాలు’ ఫేం అనుదీప్ కేవి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకుంది. కామెడీ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం దీపావ‌ళికి అక్టోబర్ 21వ తేదీన విడుద‌ల కానుంది.

జిన్నా
8

మంచు విష్ణు జిన్నా  మూవీ లో సన్నీ లియోన్ ,  పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ లుగా నటించగా సూర్య ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని కూడా అక్టోబర్ 21న విడుదల కానుంది   

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+