చీకటి రాజ్యం సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కమల్ హసన్, త్రిషా, ప్రకాష్ రాజ్,
సంపత్ రాజ్, కిశోర్, మధు శాలిని, యుగి సేతు, ఆశా శరత్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాజేష్ ఎమ్ సెల్వ నిర్వహించారు మరియు నిర్మాత చంద్ర హసన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు గిబ్రన్ స్వరాలు సమకుర్చారు.
కథ
దివాకర్ (కమల్‌హాసన్) నార్కాటిక్ కంట్రోల్ బ్యూరో పోలీస్ ఆఫీసర్. ఓ డ్రగ్ ఆపరేషన్లో మణి (యుగి సేతు)తో కలిసి భారీ ఎత్తున కొకైన బ్యాగ్స్ పట్టుకుంటాడు దివాకర్. అవి విఠల్ రావు(ప్రకాష్ రాజ్)కు చెందినవి. దీంతో విఠల్ రావు దివాకర్ కుమారుడు వాసు(అమన్ అబ్దుల్లా)ను కిడ్నాప్ చేసాడు. తన కొకైన్ ఇస్తేనే పిల్లాడిని వదులుతానని బ్లాక్ మెయిల్ చేస్తాడు. తన కొడుకును వారి నుంచి కాపాడుకోవడానికి దివాకర్ ఏం చేసాడు అనేది సినిమా.