X
Home టాప్ లిస్టింగ్

తెలుగు సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న ప్రముఖ జంటలు వీళ్లే..!

Author Administrator | Updated: Wednesday, July 5, 2023, 12:35 PM [IST]

ఇండ‌స్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జ‌రుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జ‌రిగిపోతున్నాయి. కొంద‌రు మాత్రం అలాగే ద‌శాబ్ధాల పాటు క‌లిసుంటున్నారు కానీ మ‌రికొంద‌రు మాత్రం కొన్నేళ్ల‌కే విడిపోతున్నారు. ఇక ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వాళ్లలో వాళ్లకు కుదరక.. పొత్తు పడక.. అభిప్రాయాలు కలవక పెళ్లైన తర్వాత విడిపోయి విడాకులు తీసుకున్న జంటల గురించి తెలుసుకుందాం.


cover image
మంచు మనోజ్ కుమార్
1

మంచు మనోజ్ తన భార్య ప్రణతి రెడ్డికి విడాకులు ఇచ్చాడు. ఇది నిజంగానే ఓ సంచలనం. పెళ్లై పట్టుమని మూడేళ్లు కూడా కాకుండానే భార్యాభర్తలు విడిపోయారు. 

ప్రకాష్ కోవేలమూడి
2

దర్శకుడు కె.రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి గత 2014లో ప్రేమ వివాహం జరిగింది. ఈయన కనిక దిల్లాన్‌ అనే సినీ రచయిత్రిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి పలు చిత్రాలు కూడా చేశారు. తామిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతోనే తామిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయినట్టు తెలిపారు.

సుమంత్
3

సుమంత్, కీర్తి రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు.  అయితే ఆ బంధం ఎంతో కాలం నిల‌వ‌లేదు. ప్రేమించి, పెళ్లి చేసుకున్నా రెండేళ్లు కూడా వారు క‌లిసి ఉండలేక‌పోయారు. సుమంత్‌తో విడాకులు తీసుకున్న కీర్తి మ‌రో వ్య‌కిని పెళ్లి చేసుకుని, ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అయింది. సుమంత్ మాత్రం మ‌రో పెళ్లి చేసుకోలేదు. 

పవన్ కల్యాణ్
4

పవన్ కల్యాణ్, రేణూదేశాయ్‌కు విడాకులు ఇచ్చి మూడో వివాహాం చేసుకున్నాడు. అంతకు ముందు తన మొదటి భార్య నందిని విడాకులు ఇచ్చిన తర్వాతే రేణు దేశాయ్‌ను పెళ్లి చేసుకున్నాడు.

నాగార్జున అక్కినేని
5

నాగార్జున అక్కినేని 1984 లో డాక్టర్ డి రామానాయిడు కుమార్తె లక్ష్మి దగ్గుబాటిని వివాహం చేసుకున్నాడు, కాని అతను 1990 లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. నాగ చైతన్య అమ్మ లక్ష్మి కి విడాకులు ఇచ్చిన తర్వాతే అమలను ప్రేమ వివాహాం చేసుకున్న నాగార్జున. 

ఝాన్సీ
6

నటి, యాంకర్ ఝాన్సీ మొదట జోగి నాయుడిని వివాహం చేసుకున్నారు వీరికి ఒక బిడ్డను కలిగి ఉన్నారు. అతనితో  విడాకులు తీసుకున్న తరువాత, ఆమె చాలా చిన్న వయస్సులో ఉన్న వ్యక్తితో సహా జీవనం చేస్తున్నట్టు సమాచారం..!   

శరత్‌బాబు
7

నటుడు శరత్ బాబు మొదటిసారి నటి రామ ప్రభును 1981 లో వివాహం చేసుకున్నారు. ఈ జంట 1988 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు.

రాధిక శరత్ కుమార్
8

రాధిక కు మూడుసార్లు వివాహం జరిగింది. ఆమె మొదటి వివాహం 1985 లో నటుడు-దర్శకుడు ప్రతాప్ పోథన్‌తో జరిగింది. ఆమె రెండవ వివాహం రిచర్డ్ హార్డీతో జరిగింది. ప్రస్తుతం ఆమె సహా నటుడు శరత్ కుమార్ ను వివాహం చేసుకుంది.

ప్రకాష్ రాజ్
9

ప్రకాష్  రాజ్ ఇంతకుముందు 1994 లో నటి లలితా కుమారిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు-మేఘనా, పూజ మరియు ఒక కుమారుడు సిద్దూ ఉన్నారు. ఈ జంట 2009 లో విడాకులు తీసుకున్నారు మరియు ప్రకాష్ రాజ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మను 2010 లో వివాహం చేసుకున్నారు.

కమల్ హాసన్
10

1978 లో, కమల్ హసన్ 24 సంవత్సరాల వయసులో నర్తకి వాణి గణపతిని వివాహం చేసుకున్నారు మరియు వారు పదేళ్ల తరువాత విడాకులు తీసుకున్నారు.  కమల్ హాసన్ మరియు నటి సరికా 1988 లో కలిసి జీవించడం ప్రారంభించారు, వారి మొదటి బిడ్డ శ్రుతి హాసన్ (జననం 1986) జన్మించిన తరువాత వివాహం చేసుకున్నారు. 2002 లో ఈ జంట విడాకుల కోసం దాఖలు చేశారు,

నాగ చైతన్య
11

2017 లో నాగ చైతన్య, సమంతలకు వివాహం అయింది. అక్టోబర్ 02 2021 న అధికారికంగా తాము విడిపోతున్నట్టు ప్రకటించారు.

రామ్ గోపాల్ వర్మ
12

రామ్ గోపాల్ వర్మ ఒక ప్రముఖ తెలుగు, భారతీయ సినిమా దర్శకుడు మరియు నిర్మాత. అతను సాంకేతికంగా పరిణితి చెందిన, మాఫియా మరియు హార్రర్ నేపథ్యం కలిగిన చిత్రాలను తీయడంలో సిద్దహస్తులు. చలనచిత్ర ప్రవేశం తెలుగులో జరిగినా తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డారు. ఆయనకు పేరు తెచ్చిన చిత్రాలలో ముఖ్యమైనవి శివ, క్షణ క్షణం, రంగీలా, సత్య,కంపెనీ, మరియు భూత్. కథ, స్క్రీన్ ...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+