చింతకాయల రవి సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, అనుష్క, మమతా మోహన్ దాస్, బ్రహ్మానందం, ప్రదీప్ శక్తి, అలీ, సునీల్, ఎమ్మెస్ నారాయణ,వేణుమాధవ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మోగేష్ నిర్వహించారు మరియు నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకులు విశాల్, శేఖర్ కలిసి స్వరాలు సమకుర్చారు.
కథ
ఏజ్ బార్ అయిన రవి (వెంకటేష్) అమెరికాకు సాప్ట్ వేర్ ఉద్యోగం కోసం వెళ్తాడు. అయితే అనుకోని స్ధితిలో డబ్బు ఖర్చు అయి వెనక్కి (ఇండియా)వెళ్ళి తన తల్లి(లక్ష్మి)ని భాధ పెట్టలేక అక్కడే బార్ లో వెయిటర్ గా సెటిల్ అవుతాడు. అలాగే అక్కడే సెటిలయిన ఎన్నారై సునీత (అనూష్క)తో తగువు పడుతూంటూంటాడు. ఈలోగా రవి.. సాప్ట్ వేర్ ఇంజనీర్ అనే భ్రమలో ఉన్న తల్లి తండ్రులు స్క్రిక్ట్ గా ఉండే లాండ్ లార్డ్(షాయీజీ షిండే) కూతురు మామిడికాయల లావణ్య(మమతా మోహన్ దాస్) తో సంభందం సెటిల్ చేస్తారు. అయితే ట్విస్టు ఏమిటంటే లావణ్యకి క్లోజ్ ప్రెండ్ సునీత. సునీత ద్వారా విషయం ఇండియా లో ఉన్న వారికి బయిటపడుతుంది. దాంతో ఇరుక్కున్న రవి తల్లికీ ఈ విషయం తెలియకూడదని ఏం నిర్ణయం తీసుకున్నాడు...హీరోయిన్స్ లో ఎవరని చేసుకున్నాడనేది మిగతా సినిమా!!