కలర్ ఫోటో సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుహాస్, చాందిని చౌదరి, సునీల్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం సందీప్ రాజ్ వహిస్తున్నారు. నిర్మాత సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం కాల భైరవ అందిస్తున్నారు.
కథ
పేదరికంలో పుట్టిన జయకృష్ణ ఇంజినీరింగ్ విద్యార్థి. ఇంటికి సంబంధించిన పాల వ్యాపారంలో భాగమై కుటుంబానికి అండగా ఉంటాడు. నలుపు రంగులో ఉండే జయకృష్ణ తన కాలేజీలో ఇంజినీరింగ్ చదువుకొనే మిల్కి బ్యూటీ దీప్తి వర్మ (చాందినీ చౌదరీ)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అన్ని కథల్లో మాదిరిగానే దీప్తి అన్నయ్య రామరాజు (సునీల్) అడ్డుగా నిలుస్తాడు. మచిలీపట్నంలో ఇంజినీరింగ్ కాలేజీలో జయకృష్ణ, దీప్తి ప్రేమ కథ ఎలా సాగింది. అందం, డబ్బు లేని జయకృష్ణను చూసి సంపన్న కుటుంబంలో పుట్టిన దీప్తి ఎలా ప్రేమలో పడింది. పోలీస్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేసే రామరాజు ఏ కారణంగా వారి ప్రేమను వ్యతిరేకించాడు. ప్రేమికులంటే రామరాజుకు ఎందుకు గిట్టదు? ఏ పరిస్థితుల్లో చందు (ఆదర్శ్ బాలకృష్ణ)ను దీప్తి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? దీప్తి పెళ్లి తర్వాత జయకృష్ణ జీవితంలో ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకొన్నాయి? దీప్తి, జయరాజు ప్రేమ కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే కలర్ ఫోటో కథ.