కరెంట్ (2009)
Release date
19 Jun 2009
genre
కరెంట్ స్టోరి
కరెంట్ సినిమా డ్రామా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుశాంత్, స్నేహావుల్లాల్, చరణ్ రాజ్, తనికెళ్ల భరణి, సుధ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, షఫీ, సునిల్ శేట్టి, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి సూర్యప్రతాప్ నిర్వహించారు మరియు నిర్మాతలు చింతలపూడి శ్రీనివాసరావు, ఎ నగసుశీల కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు.
కథ
సుశాంత్(సుశాంత్)కి మొదటనుంచీ నిన్నటి గురించి ఆలోచించడం..రేపటి కోసం ఎదురు చూడటంనచ్చదు. అందుకు పూర్తి వ్యతిరేకం స్నేహ(స్నేహా వుల్లాల్). ప్రతీది ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ పోయే ఆమెకు కాలేజీలో సుశాంత్ తగులుతాడు. ఆమెను చూసిన మరుక్షణమే అందరి హీరోల్లాగే ప్రేమలో పడిపోతాడు. పడిందే తడువుగా ఆమె వెనుక పడతాడు. ఛీ..పొమ్మన్నా..నాటకాలు ఆడి మరీ ఆమెను ప్రేమలో పడేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి కూడా మోడ్రన్ గా ఆలోచించి కూతురు ప్రేమను ఏక్సెప్ట్ చేయటానికి రెడీ యి ఫలానా టైమ్ కి రమ్మని అపాయింట్ మెంట్ ఇస్తాడు. కానీ సుశాంత్ ఆ టైమ్ కి రాడు. ఎందుకు రాలేదు అంటే ఆ టైమ్ కి క్రికెట్ ఆడుతూంటాడు. ఇది చూసిన ఆమె నీకు భాద్యత లేదు..నీ ప్రేమ నాకు అక్కర్లేదు అని నిందిస్తుంది. అది విన్న మనవాడు నేను భాద్యత లేనివాడినని నా ప్రేమలో పడేటప్పుడు తెలియదా అని తెలివిగా చెప్పి కూల్ గా ఓకే మనం విడిపోదాం అంటాడు. మనం కంగారుపడి ఏంటిలా జరుగుతోంది..అతను ఆమెని నిజంగా ప్రేమించలేదా..అని విచిత్రంగా చూస్తుండగానే ఆమె వెళ్లిపోతుంది. కొద్ది రోజుల తర్వాత నిన్ను మర్చిపోలేకపోతున్నా..నువ్వే నాలో ప్రేమను పుట్టించావు కాబట్టి నువ్వే తీసెయ్యి అంటుంది. ఇదేంటి ఇలాంటి ట్విస్టు అనుకుంటుండగా హీరోగారు సరేనంటారు..అప్పుడు ఏం జరుగుతుంది అంటే తెరపై చూడాల్సిందే.
**Note:Hey! Would you like to share the story of the movie కరెంట్ with us? Please send it to us ([email protected]).