X
కరెంట్

కరెంట్

Drama | 19 Jun 2009 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

కరెంట్ స్టోరీ

కరెంట్ సినిమా డ్రామా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుశాంత్, స్నేహావుల్లాల్, చరణ్ రాజ్, తనికెళ్ల భరణి, సుధ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, షఫీ,  సునిల్ శేట్టి, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి సూర్యప్రతాప్ నిర్వహించారు మరియు నిర్మాతలు చింతలపూడి శ్రీనివాసరావు, ఎ నగసుశీల కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు. కథ సుశాంత్(సుశాంత్)కి మొదటనుంచీ నిన్నటి గురించి ఆలోచించడం..రేపటి కోసం ఎదురు చూడటంనచ్చదు. అందుకు పూర్తి వ్యతిరేకం స్నేహ(స్నేహా వుల్లాల్). ప్రతీది ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ పోయే ఆమెకు కాలేజీలో సుశాంత్ తగులుతాడు. ఆమెను చూసిన మరుక్షణమే అందరి హీరోల్లాగే ప్రేమలో పడిపోతాడు. పడిందే తడువుగా ఆమె వెనుక పడతాడు. ఛీ..పొమ్మన్నా..నాటకాలు ఆడి మరీ ఆమెను ప్రేమలో పడేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి కూడా మోడ్రన్ గా ఆలోచించి కూతురు ప్రేమను ఏక్సెప్ట్ చేయటానికి రెడీ యి ఫలానా టైమ్ కి రమ్మని అపాయింట్ మెంట్ ఇస్తాడు. కానీ సుశాంత్ ఆ టైమ్ కి రాడు. ఎందుకు రాలేదు అంటే ఆ టైమ్ కి క్రికెట్ ఆడుతూంటాడు. ఇది చూసిన ఆమె నీకు భాద్యత లేదు..నీ ప్రేమ నాకు అక్కర్లేదు అని నిందిస్తుంది. అది విన్న మనవాడు నేను భాద్యత లేనివాడినని నా ప్రేమలో పడేటప్పుడు తెలియదా అని తెలివిగా చెప్పి కూల్ గా ఓకే మనం విడిపోదాం అంటాడు. మనం కంగారుపడి ఏంటిలా జరుగుతోంది..అతను ఆమెని నిజంగా ప్రేమించలేదా..అని విచిత్రంగా చూస్తుండగానే ఆమె వెళ్లిపోతుంది. కొద్ది రోజుల తర్వాత నిన్ను మర్చిపోలేకపోతున్నా..నువ్వే నాలో ప్రేమను పుట్టించావు కాబట్టి నువ్వే తీసెయ్యి అంటుంది. ఇదేంటి ఇలాంటి ట్విస్టు అనుకుంటుండగా హీరోగారు సరేనంటారు..అప్పుడు ఏం జరుగుతుంది అంటే తెరపై చూడాల్సిందే.
Read More

కరెంట్ కాస్ట్ & క్రూ

కరెంట్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం సుర్య ప్రతాప్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత చింతలపూడి శ్రీనివాస రావు, ఎ నాగ సుశీల
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కరెంట్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
'కాళిదాసు'కెళ్ళాం ఖర్చయిపోయాం..ఈ రెండో సినిమా 'కరెంటు'కైనా కరుణిస్తాడా అంటే..అంత లక్ మీకు లేదు అని తేల్చేసాడు సుశాంత్. తన కజిన్ సుమంత్ లాగే సుశాంత్ కీ మంచి కథలు కొరతలాగుంది. అయినా ఇంటర్వెల్ పాయింటుని అనుకుని పైకీ,క్రిందకి కథ అల్లుకుంటే ఇలాంటి నెగిటివ్ ఫలితాలే వస్తాయనేది సుస్పష్టం.అలాగే డాన్స్ లు బాగానే చేసినా చాలా సన్నివేశాల్లో హీరో సుశాంత్ లో ఫేస్ ఫీలింగ్స్ పెద్ధగా పలకక పోవటం మరో ఇబ్బంది. ఇలా కథ, కథనాలు వీకైన ఈ చిత్రం యూత్ ని టార్గెట్ చేసినా ఏ వర్గాన్నీ ఆకర్షించేటట్లు కనపడటం లేదు.

కరెంట్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కరెంట్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+