X
దండుపాళ్యం 2
Crime | Thriller | 21 Jul 2017 | A | 165 Mins
Telugu

దండుపాళ్యం 2 స్టోరీ

దండుపాళ్యం 2 సినిమా క్రైమ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పూజాగాంధి, బొమ్మాళి రవిశంకర్, రఘు ముఖర్జీ, శృతి, సంజన, భాగ్యశ్రీ, మకరంద్ దేశ్ పాండే, రవి కాలె, పెట్రోల్ ప్రసన్న, డానీ కుట్టప్ప, జయదేవ్, కరి సుబ్బు, కోటి తదితరులు నటించారు. ఈ సినిమాకి కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: శ్రీనివాసరాజు వహించారు మరియు నిర్మాత వెంకట్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అర్జున్ జన్య అందించారు. 

కథ

దాదాపు ఐదేళ్ల విచారణ అనంతరం దండుపాళ్యం గ్యాంగ్‌కు ఉరిశిక్ష విధిస్తారు. అనంతరం వారిని బెంగళూరు నగర శివారులోని పరప్పన అగ్రహార జైలుకు తరలిస్తారు. అయితే ఈ కేసులో అభివిక్తి అనే మహిళా రిపోర్టర్‌కు అనేక అనుమానాలుంటాయి. 80 హత్య కేసుల్లో వీరిపై నేరం రుజువైనా..... కేవలం 12 కేసుల్లో మాత్రమే నేరాన్ని రుజువు చేసే సాక్ష్యాలుంటాయి. అవి కూడా బలమైన సాక్ష్యాలు కావు. ఇలాంటి కేసుల్లో అత్యంత కీలకమైన వేలిముద్రలు, వీర్య కణాలు, డీఎన్ఏ, హెయిర్ ఎలాంటి సాక్ష్యాలు లేకుండానే 80 కేసుల్లో వీరిని దోషులుగా తేల్చడం ఏమిటి? అని అనుమాన పడిన సదరు రిపోర్ట్...... అసలు నిజాలు తెలుసుకునేందుకు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో కొన్ని షాకింగ్ ఎడివిడెన్స్ అభివిక్తి దృష్టికి వస్తాయి. దీంతో ఆ గ్యాంగ్ ఏ తప్పూ చేయలేదని, పోలీసులు, మీడియా కలిసి వారిని నరహంతక గ్యాంగ్‌‌గా చిత్రీకరించారనే నిర్దారణకు వస్తుంది. తన ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా దండుపాళ్యం గ్యాంగ్‌ను పరప్పన అగ్రహార జైలు నుండి బెళగాం జైలుకు తరలిస్తారు. ఉరిశిక్ష అమలు చేయడానికి ఎలాంటి సదుపాయాలు లేని ఆ జైలుకు వారిని తరలించడంతో ఆమెకు అనుమానాలు మరింత బలపడతాయి. పోలీసులు ఏదో కుట్ర చేస్తున్నారని నమ్ముతుంది. స్పెషల్ పర్మిషన్ తీసుకుని వారిని జైల్లో కలిసి అసలు నిజం తెలుసుకోవాలని భావిస్తుంది. అయితే తమను కాపాడటానికి వచ్చిన ఆ రిపోర్టర్‌ను చంపడానికి ప్రయత్నిస్తుంది దండుపాళ్యం గ్యాంగ్. ఇదే ఇంటర్వెల్ ట్విస్ట్. ఇంతకు మించి చెబితే మీకూ సినిమాపై ఇంట్రెస్టు పోతుంది. తర్వాత ఏం జరిగింది అనేది తెరపై చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+