twitter

    దర్బార్ స్టోరి

    దర్బార్ సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రజనీకాంత్‌ తోపాటు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, నయనతార, ప్రతీక్ బబ్బర్, నివేదా థామస్, దిలీప్ తాహిల్, నవాబ్ షా, గురు భుల్లార్, యోగిబాబు, శ్రీమన్, జతిన్ శర్మ, తదితరులు నటించారు.  ఈ సినిమాకి దర్శకత్వం ఎఆర్ మురగదాస్ వహించారు. లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై అల్‌రాజా సుభాస్కరన్ నిర్మించారు. ఈచిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందించారు. 

    కథ

    ముంబై కమిషనర్ ఆదిత్య అరుణాచలం (రజనీకాంత్) సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ముంబైలో డ్రగ్, అమ్మాయిల అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు ప్రత్యేకంగా నియమించబడుతాడు. డ్రగ్ మాఫియాను తుడిచిపెట్టే క్రమంలో చేసిన ఎన్‌కౌంటర్లపై మానవ హక్కుల కమిషన్, సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో తన కూతురు వల్లి (నివేదా థామస్‌) ప్రాణాలను సైతం కోల్పోవాల్సి వస్తుంది. తన కూతురును కోల్పోవడంతో ఆదిత్య అరుణాచలం మరింత అగ్రెసివ్‌గా మారుతాడు. డ్రగ్స్, మానవ అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు ఆదిత్య అరుణాచలం ఎలాంటి ఆపరేషన్లు చేపట్టాడు? డిప్యూటీ సీఎం కూతురు కిడ్నాప్‌ను ఎలా డీల్ చేశాడు? మాఫియా చేతిలో వల్లి ఎలా ప్రాణాలు కోల్పోయింది. సిన్సియర్‌గా డ్యూటీ చేసే ఆదిత్య జీవితంలోకి లిల్లీ (నయనతార) ఎలా ప్రవేశించింది. హరిచోప్రా (సునీల్ శెట్టి) విలనిజం ఎంత వరకు పండింది అనే ప్రశ్నలకు సమాధానం కోసం తెరపై దర్బార్ సినిమా చూడాల్సిందే.
    **Note:Hey! Would you like to share the story of the movie దర్బార్ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X