దరువు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజ, తాప్సీ, సత్యనారాయణ, ప్రభు, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, సాయాజీషిండే, రఘుబాబు, వెన్నెల కిషోర్, అవినాష్, సన తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే ,దర్శకత్వం: జె. శివ కుమార్ నిర్వహించారు మరియు నిర్మాత బూరుగపల్లి శివరామకృష్ణ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు విజయ్ ఆంటోని స్వరాలు సమకుర్చారు.
కథ
చిత్రగుప్తుడు(ఎంఎస్)తన బాస్ యమధర్మరాజు(ప్రభు)మీద కోపంతో,ఆయన్ని ఇరికించాలని భూలోకంలో ఉండే ఓ వ్యక్తిని లేపేసి తన లోకం తీసుకువస్తాడు. ఆ వ్యక్తే బుల్లెట్ రాజా (రవితేజ). దొంగతనాలు చేసుకు బ్రతికే బుల్లెట్ రాజా అప్పటికి శ్వేత (తాప్సీ)తో ప్రేమలో పడి పాడుకుంటుంటాడు. అంతేగాక ఆమె కోసం ఆమె బావ హార్బర్ బాబు (సుశాంత్ సింగ్)తో తలపడి గెలిచేలోగా పైకి పోతాడు. అయితే నరకంలో అసలు విషయం తెలుసుకున్న బుల్లెట్ రాజా, అక్కడ యముడుతో తగువు పెట్టుకుని తిరిగి భూలోకానికి రావటానికి ప్లాన్ చేసుకుంటాడు. అయితే అప్పటికే అతని శవం కాలి బూడిదై పోయింది. అప్పుడు తన పోలికలతోనే ఉన్న రవీందర్(మళ్లీ రవితేజ) అనే మర్డరైపోయి చనిపోయిన హోం మినస్టర్ శరీరంలో ప్రవేశిస్తాడు. ఆ తర్వాత బుల్లెట్ రాజా ఏం చేసాడు... తన ప్రేమను ఎలా సాధించుకున్నాడు.. హోం మినిస్టర్ ని చంపిన వాళ్లకు ఎలా బుద్ది చెప్పాడన్నది మిగతా కథ.